కరోనా ఉన్న వారు, వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ రావద్దని సూచన
వీరికి 45 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ ఇంజనీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 16 నుంచి పరీక్షలు పెట్టాలని ప్రైమరీగా డిసిషన్ తీసుకుంది. ప్రస్తుతం బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ కు మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మిగిలిన సెమిస్టర్ స్టూడెంట్స్ ను ప్రమోట్ చేయనున్నారు. ఐతే కరోనాతో బాధపడుతున్న స్టూడెంట్స్ మాత్రం పరీక్షలు రాసేందుకు రావద్దని కోరుతున్నారు. వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కు రావాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని వాళ్లను పరీక్షలకు రావద్దని సూచిస్తున్నారు. వీరికోసం 45 రోజుల తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు. జేఎన్టీయూ పరిధిలో బీటెక్, బీ ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ దాదాపు 70 వేల మంది ఉన్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన వారు 2 వేల వరకు ఉన్నారు.
రూల్స్ ప్రకారం ఏర్పాట్లు
కరోనా ఎఫెక్ట్ తో ఎగ్జామ్స్ విధానంలో యూజీసీ మార్పులు సూచించింది. అందుకు అనుగుణంగా జూన్ 20 నుంచే పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా కేసులు పెరగటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనఫీషియల్గా తెలిపింది. దీంతో సెప్టెంబర్ 16 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అంతా రెడీ చేశారు. రెండు కోర్సుల్లో ఏడు సబ్జెక్టులే ఉండటంతో పదిరోజుల్లో ఎగ్జామ్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఫిజికల్ డిస్టెన్స్ ను పాటించనున్నారు. సొంతూరుకు దగ్గరల్లో ఉన్న కాలేజీలో ఎగ్జామ్స్ రాసేందుకు కూడా స్టూడెంట్స్ కు జేఎన్టీయూ అనుమతిచ్చింది. వీరి వివరాలను ఈ నెల 25 వరకు ఇవ్వాలని కాలేజ్ ప్రిన్సిపాల్స్ ను అధికారులు ఆదేశించారు.
For More News..