- జేఎన్టీయూ స్టూడెంట్ల ప్రతిభ
కొడిమ్యాల, వెలుగు : తక్కువ ఖర్చుతో ఇండిపెండెంట్ సస్పెన్షన్ గోకార్టును జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆవిష్కరించారు. శుక్రవారం నిర్వహించిన ప్రాజెక్టు వైవాలో దీనిని ప్రదర్శించారు. కేవలం రూ.19 వేల ఖర్చుతో 180 కిలోల బరువును మోసే గోకార్ట్ ను తయారు చేసి అబ్బుర పరిచారు. లీటరు పెట్రోల్ తో సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని స్టూడెంట్స్ తెలిపారు.
మెకానికల్ హెచ్ఓడీ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ నాగరాజు, శ్యామ్, నరేశ్, నిఖిల్, రెహన్, మనోజ్ లు తయారు చేశారు. నాలుగు ఇండిపెండెంటు సస్పెన్షన్ లు ఉన్న మొదటి గోకార్టు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వసంత్ కుమార్ తెలిపారు. స్టూడెంట్స్ను ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ రమేశ్, ఫ్యాకల్టీ అభినందించారు.