జేఎన్టీయూ ఎగ్జామ్స్ వాయిదా.. ఎందుకంటే..

జేఎన్టీయూ ఎగ్జామ్స్ వాయిదా.. ఎందుకంటే..

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి.  మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో  యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ వెంకటేశ్వర రావు సర్కులర్ జారీ చేశారు. యూనివర్సిటీ తో పాటు వర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు