
పదే పదే కాలేజీలు మారితే బ్లాక్ లిస్టులో పెడ్తాం
ఫ్యాకల్టీకి జేఎన్టీయూ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు : పదే పదే కాలేజీలు మారే ఫ్యాకల్టీ మెంబర్స్‌ను వర్సిటీలు బ్లాక్‌లిస్టులో పెట్టాలని జేఎన్టీ యూ ఆదేశించింది. లెక్చరర్ లేదా ప్రొఫెసర్లు కాలేజీ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటే కనీసం 2నెలల ముందు నోటీస్ ఇవ్వాలని వెల్లడిం చింది. విద్యార్థులకు నష్టం కలగకుం డా ఫాకల్టీ మెంబర్స్సెమిస్టర్ పూర్త య్యేదాకా అదే కాలేజీలో కొనసాగాల ని తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళ వారం జేఎన్టీయూ రిజిస్ట్రార్ సర్క్యు లర్‌ను జారీ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కోసం కాలేజీ యాజమా న్యాలు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలన్నారు. నియామకం టైంలోనే స్టాఫ్ మెంబర్స్ కు సర్వీస్ రూల్స్ పేపర్‌ను అందించాలని తెలిపారు. సెమిస్టర్అయిపోయేదాకా ఫ్యా కల్టీని ఉద్యోగం నుంచి తొలగిం చరాదని..ఒకవేళ తొలగిస్తే కాలేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫ్యాకల్టీ మెంబర్స్‌ను జేఎన్టీ యూ భయపెడ్తున్నదని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీస్ ఎంప్లా యీస్ అసోసియేషన్ (టీఎస్టీసీ ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సం తోష్ కుమార్ఆరోపించారు. సర్క్యుల ర్ను వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఉద్యోగులకు కాలేజీలు ప్రతి నెలా తప్పనిసరిగా జీతాలు చెల్లించేలా జేఎన్టీయూ రూల్స్ రూపొందించాలని కోరారు.