
హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH) 4వ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 2025లో నిర్వహించిన బి.టెక్ IV ఇయర్ I సెమిస్టర్ (R18 రెగ్యులేషన్) పరీక్షల ఫలితాలు విడుదలయినట్లు ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలకు మొత్తం 28 వేల480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 27 వేల533 మంది హాజరయ్యారు. వీరిలో 19 వేల385 మంది అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యారు. మొత్తం పాస్ శాతం 70.41% గా నమోదైంది.
విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను JNTUH అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. https://www.jntuh.ac.in/