హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని చెప్పారు. కొత్త నోటిపికేషన్, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వరుస పోటీ పరీక్షలతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పరీక్ష సరిగా నిర్వహించలేకపోవడంతో 2 సార్లు గ్రూప్1 రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. గ్రూప్2 పరీక్షను ఆగస్ట్ నుంచి డిసెంబర్కు మార్చామని ఆయన గుర్తుచేశారు. అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 వాయిదా వేశామని చెప్పారు. గత పాలనలో పోటీ పరీక్షలు గందరగోళంగా మారాయని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ రిలీజ్.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
- అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్
- నవంబర్లో గ్రూప్ 3
- ల్యాబ్ టెక్నిషియన్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులకు సెప్టెంబర్లో నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష
- వాయిదా వేసిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్లో నిర్వహణ
- ట్రాన్స్ కో ఇంజినీర్ల పోస్టులకు అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరి 2025లో పరీక్ష
- గెజిటెడ్ కేటగిరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరి 2025లో పరీక్ష
- నవంబర్లో టెట్ నోటిఫికేషన్, జనవరిలో పరీక్ష
- గ్రూప్1 కోసం అక్టోబర్లో నోటిఫికేషన్, 2025 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ నిర్వహణ
- గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్ల నియామకం కోసం జనవరి 2025న నోటిఫికేషన్, ఏప్రిల్లో పరీక్ష
- టీచర్ల నియామకం కోసం డీఎస్సీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో నియామక పరీక్ష
- ఫారెస్టు బీట్ ఆఫీసర్ల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలో పరీక్ష
- ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్, జూన్లో పరీక్ష నిర్వహణ
- జూలైలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్
- పోలీసు శాఖలో ఎస్సై సివిల్ పోస్టులకు ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో పరీక్షలు
- పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి ఆగస్టులో పరీక్షలు
- డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర అకాడమిక్ పోస్టులకు జూన్లో నోటిఫికేషన్, సెప్టెంబర్లో భర్తీ
- డిగ్రీ లెక్చరర్లు తత్సమాన పోస్టులకు జూన్లో నోటిపికేషన్, సెప్టెంబర్లో నియామక పరీక్ష
- గ్రూప్–2 పోస్టులకు మేలో నోటిఫికేషన్, అక్టోబర్లో పరీక్షలు
- గ్రూప్ 3 పోస్టులకు జూలైలో నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష
- ఇతర ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులకు జులైలో నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష