నవంబర్ 26న ఓయూలో ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా

ఓయూ, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయ్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈనెల 26న ఫార్మసిస్టు ఉద్యోగాల కోసం జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫీసర్లు ఒక ప్రకటనలో తెలిపారు.  అపోలో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్​మేళాలో సుమారు 100 ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్​ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.  

డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం. ఫార్మసీ డిగ్రీ చేసిన18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్‌చార్జి రాము తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.14 ,800 నుంచి రూ.25 వేల వరకు వేతనం  ఉంటుందని తెలిపారు.  

ఆసక్తి గల వారు ఈ నెల 26న తమ సర్టిఫికెట్లు,  జిరాక్స్ కాపీలతో ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్​మెంట్​బ్యూరో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.