
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చుంచుపల్లి మండల పరిషత్ ఆఫీస్లో ఈ నెల 29న నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శ్రీరామ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పారమౌంట్ బిల్డింగ్ సొల్యూషన్స్, భారత్ మోటో కార్పోరేషన్ సంస్థల్లో పనిచేసేందుకు వంద మంది అవసరం ఉందన్నారు.
వెల్డర్, ఫిట్టర్, సూపర్ వైజర్ ట్రైనీ ఇంజనీర్స్, ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్ పోస్టులకు ఐటీఐ, డిప్లమా మెకానికల్, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలుంటాయని తెలిపారు.