
ములుగు, వెలుగు : ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ఈనెల 19న నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి సీతక్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో 58 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. విప్రో, ముథూట్ గ్రూప్స్, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, సాఫ్టెక్ సొల్యూషన్, మెడ్ ప్లస్, సెవెన్ టెక్ ఐటీ సొల్యూషన్, శ్రీ చైతన్య విద్యాసంస్థలు తదితర 58 కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇంచర్ల జీఎంఆర్ గార్డెన్స్లో ఉదయం 9గంటలకు మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు.