
కాశీబుగ్గ, వెలుగు: జాబ్ మేళా విజయవంతానికి సమన్వయంతో పని చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం వరంగల్ (తూర్పు)నియోజక వర్గ పరిధిలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్ నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ సత్య శారద బల్దియా కమిషనర్ డాక్టర్అశ్విని తానాజీ వాకడే తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
జాబ్ మేళాను విజయవంతం చేయడంపై వివిధ విభాగాల ఉన్నతాధికారులకు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆఫీసర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.