సంగారెడ్డి టౌన్ , వెలుగు : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈనెల 12న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి వందన బుధవారం తెలిపారు. డీమార్ట్ లో 135 ఖాళీలను భర్తీ చేయడానికి ఎస్సెస్సీ అర్హత కలిగి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.
వేతనం రూ.12,000 నుంచి రూ.16, 000 వరకు చెల్లిస్తారని చెప్పారు. ఆసక్తి గలవారు సంగారెడ్డి లోని బైపాస్ రోడ్ లో గల జిల్లా ఉపాధి కార్యాలయం ప్రాంగణంలో హాజరు కావాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాల కోసం 08455 271010 ను సంప్రదించవచ్చన్నారు.