మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో టూల్ డిజైనర్ల కొరతను తీరుస్తూ.. టెక్నికల్ స్టూడెంట్స్‌కు జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ అందిస్తోంది బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్. ఇక్కడ స్కిల్స్ నేర్చుకున్న వందల మంది టాప్ కంపెనీల్లో జాబ్స్ కొట్టడంతోపాటు సొంతంగా ఇండస్ట్రీస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఎంఈ, ఎంటెక్, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్ కొనసాగుతున్నాయి.
ఎంఎస్ఎంఈ సంపర్క్
సీఐటీడీలో ట్రైనింగ్ పొందిన జాబ్ సీకర్ను.. ట్రైనింగ్ స్టాఫ్ అవసరం ఉన్న ఇండస్ట్రీ రిక్రూటర్‌ను ఒకే వేదికపైకి తెచ్చే పోర్టలే ఎంఎస్ఎంఈ సంపర్క్. సీఐటీడీలో అన్ని విభాగాల్లో కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు సంపర్క్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. టూల్ డిజైనర్లు, ఇతర స్టాఫ్ అవసరం ఉన్న ఇండస్ర్టీలు సంపర్క్ పోర్టల్ ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి.
ఎస్సీ, ఎస్టీలకు ఉచితం
ఏడాదిలోపు వ్యవధితో ఉండే షార్ట్‌టెర్మ్/సర్టిఫికెట్, పీజీ డిప్లొమా కోర్సులతోనే అధికమంది ఉపాధి పొందుతున్నారు. ఇవి ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కు ఉచితం. రిజిస్ర్టేషన్ ఫీజు కోర్సును బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీల వారికి కోర్సు ఫీజు ఉంటుంది. ఈ విభాగంలో క్యాడ్/క్యామ్, వీఎల్ఎస్ఐ, ఆటోమేషన్ లో దాదాపు 35 సర్టిఫికెట్ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్ కోర్సులు
ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తోపాటు నిరుద్యోగ యువతకు సీఐటీడీ ఆన్లైన్ కోర్సులు ఆఫర్ చేస్తోంది. నెల రోజుల వ్యవధి గల ఈ కోర్సుల ఫీజు రూ.8350. ఎస్సీ ఎస్టీలకు ఉచితం. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం రూ.590 చెల్లించాలి.
కోర్సులు: ఏఎస్ఐసీ ప్రోగ్రామర్, లే అవుట్ ఇంజినీర్, ఐసీ ఫిసికల్డిజైన్ ఇంజినీర్, వీఎల్ఎస్ఐ, మాట్‌ల్యాబ్, ఎంబేడెడ్ సిస్టమ్స్, మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ప్రోగ్రామర్, పీఎల్సీ ప్రోగ్రామర్, ఆటోమేషన్ ఇంజినీర్.
అర్హత: డిప్లొమా/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్/ బయోమెడికల్/ఐటీ/ ఇన్స్ట్రుమెంటేషన్లో డిగ్రీ, ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్‌లో బీఎస్సీ/ ఎంఎస్సీ
అడ్మిషన్స్: ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ప్రతి నెల మొదటి, మూడో బుధవారం అడ్మిషన్స్ జరుగుతాయి. ఒక వేళ ఆన్లైన్లో కోర్సు వద్దు అనుకునే వారు నేరుగా సీఐటీడీకి వెళ్లి క్లాసెస్ వినొచ్చు.
సామ్‌సంగ్ కోర్సులు
సామ్‌సంగ్ టెక్నికల్ స్కూల్ పేరుతో ఐటీఐ మొదలుకొని పీజీ గ్రాడ్యుయేట్ల వరకు ప్రత్యేకంగా 5 రకాల సర్టిఫికెట్ కోర్సులను సీఐటీడీ ఆఫర్ చేస్తోంది. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి ఫ్రీ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మహిళలు, దివ్యాంగులు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి సామ్‌సంగ్ స్కాలర్‌షిప్‌తో పాటు టాపర్స్ కు అవార్డులు అందజేస్తుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్‌తో పాటు సామ్‌సంగ్ సర్వీస్ సెంటర్లలో ఆన్ జాబ్ ట్రైనింగ్, ఆపైన ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. ప్రతి నెలా మొదటి, మూడో బుధవారం ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. ఎవరైనా సీఐటీడీలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈవెనింగ్ కోర్సులు
సీఐటీడీలో 25 శాతం థియరీ, 75 శాతం ప్రాక్టికల్ పై ఫోకస్ చేస్తూ సిస్టమేటిక్ ట్రైనింగ్ ఉంటుంది. రెగ్యులర్, సర్టిఫికెట్ కోర్సులతోపాటు ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇండస్ట్రీస్‌లో పని చేసే ఎంప్లాయీస్ స్కిల్స్ పెంచేందుకు సీఐటీడీ ఈవెనింగ్ కోర్సులు రన్ చేస్తోంది. టూల్ ఇంజినీరింగ్, సీఏడీ/సీఏఎం/ సివిల్ ఇంజినీరింగ్ & ఇండస్ట్రియల్ ఆటోమేషన్ విభాగాల్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు.
–సుగ్యాన్ రంజన్ దలాయ్, డిప్యూటీ డైరెక్టర్, సీఐటీడీ హైదరాబాద్
For More News..