హైదరాబాద్‌లోని అపరల్ట్రైనింగ్ & డిజైన్ సెంటర్ టెన్త్, ఇంటర్ పాసైన స్టూడెంట్స్‌కు వొకేషనల్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తోంది. కోర్సు కంప్లీట్ చేసిన యువతకు అపరల్, టెక్స్టైల్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, రిటైల్ రంగాల్లో బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. షార్ట్ టర్మ్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికెట్ కోర్సుల నుంచి మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ వంటి కోర్సులందిస్తూ.. టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్ చూపుతున్న ఏటీడీసీ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫో ఈ వారం.
మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ విభాగం కింద ఏర్పాటైన అపరల్ ట్రైనింగ్ & డిజైన్ సెంటర్(ఏటీడీసీ)కి ఇండియాలో లార్జెస్ట్ క్వాలిటీ వోకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడర్‌గా గుర్తింపు ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 100 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, 35 ఏటీడీసీ వోకేషనల్ సెంటర్స్‌లో సర్టిఫికెట్, షార్ట్ టర్మ్, లాంగ్‌టర్మ్/ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. వీటిలో నామినల్ ఫీజుతో కొన్ని, స్కాలర్షిప్ ఓరియెంటెడ్, ఫ్రీగా అందించే కోర్సులు మరికొన్ని ఉన్నాయి.
బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
అపరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్(ఏటీడీసీ) రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్(ఆర్జీఎన్ఐవైడీ) కొలాబరేషన్‌తో అపరల్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు బ్యాచిలర్ ఇన్ వోకేషనల్ ఎడ్యుకేషన్(బీవోసీ) కోర్సులు అందిస్తోంది. వీటిలో ప్రధానంగా బీవోసీ ఇన్ అపరల్ మాన్యుఫాక్చరింగ్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బీవోసీ ఇన్ ఫ్యాషన్ డిజైన్ & రిటైల్ మూడేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సుకు 15 సీట్లు ఉంటాయి. ఇంటర్ పాసైన వారు ఈ కోర్సులకు అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్ కల్పిస్తారు. దరఖాస్తులకు 15 ఫిబ్రవరి 2021 చివరి తేది. కోర్సుల ఫీజు ఏడాదికి రూ.67,000.
డిప్లొమా కోర్సులు
నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ)లతో కలిసి ఏటీడీసీ అపరల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫ్యాషన్ డిజైన్స్‌లో డిప్లొమా కోర్సులు అందిస్తోంది.
అపరల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ: ఇది ఏడాది డ్యురేషన్ గల డిప్లొమా కోర్సు. ఇందులో ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ తదితర గార్మెంట్స్ ప్రొడక్షన్/మాన్యుఫ్యాక్చరింగ్ బేసిక్ కాన్సెప్ట్‌లు నేర్పుతారు. కోర్సు పూర్తి చేసిన వారికి టాప్ కంపెనీల్లో అసిస్టెంట్ మర్చండైజర్, ఎంటర్ప్రెన్యూర్, ప్రొడక్షన్ సూపర్వైజర్, కటింగ్ రూమ్ అసిస్టెంట్, క్వాలిటీ కంట్రోలర్స్‌గా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి.
ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ: ఇది ఏడాది డ్యురేషన్ గల డిప్లొమా కోర్సు. ఇందులో డిజైన్ బేసిక్స్, ఇల్స్ట్రేషన్, ఎంబ్రాయిడరీస్, ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, మర్చండైజర్ తదితర కాన్సెప్ట్‌లు నేర్పుతారు. కోర్సు పూర్తి చేసిన వారికి టాప్ కంపెనీల్లో అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్, శాంప్లింగ్ కోఆర్డినేటర్, స్టోర్ మేనేజర్, స్టైలిస్ట్, అసిస్టెంట్ మర్చండైజర్ హోదాల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి.
సీట్లు: ఒక్కో కోర్సులో 40 చొప్పున అడ్మిషన్లు తీసుకుంటారు.
అర్హతలు: 10+2 విధానంలో గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ
కోర్సు ఫీజు: ఒక్కో కోర్సుకు ఏడాదికి రూ.45,000
దరఖాస్తులకు చివరి తేది: 28 ఫిబ్రవరి 2021
సర్టిఫికెట్ కోర్సులు
ఏటీడీసీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్యాటర్న్ మాస్టర్, అడ్వాన్స్ ప్యాటర్న్ మేకర్ తదితర ఎనిమిది/ఆరు/నాలుగు నెలల సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. వీటికి టెన్త్/ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అర్హులు.
ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్
ఇది ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూ జీకేవై), తెలంగాణ గవర్నమెంట్ కొలాబరేషన్‌తో ఏటీడీసీ హైదరాబాద్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈ కోర్సు అందిస్తోంది. కోర్సుకు ఎలాంటి ఫీజు లేదు. హాస్టల్, బోర్డింగ్ ఉచితం. ఇంటర్ పూర్తి చేసిన గ్రామీణ ప్రాంతాల స్టూడెంట్స్ ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఇండస్ట్రీ, గార్మెంట్స్, మాన్యుఫాక్చరింగ్ తదితర బేసిక్ కాన్సెప్ట్‌లతోపాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతారు. ఆరు నెలల కోర్సు డ్యురేషన్‌లో అయిదు నెలలు థియరీ క్లాసెస్ ఒక నెల ఇండస్ట్రీలో ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. నాచారంలోని షాహి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు టాప్ బ్రాండెడ్ కంపెనీల్లో ఇండస్ట్రియల్ ఇంజినీర్‌గా, ఎగ్జిక్యూటివ్ శాంప్లింగ్ మార్కడైజర్ తదితర హోదాల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి.
స్కాలర్షిప్ సౌకర్యం
ఏటీడీసీ కోర్సుల్లో చేరిన స్టూడెంట్స్‌కు కొన్ని స్కాలర్షిప్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. గర్ల్స్ కోసం గ్యాప్ ఇండియా ‘మెరిట్ కమ్ మీన్స్’ స్కాలర్షిప్ సౌకర్యం ఉంది. అపరల్ మాన్యుఫ్యాక్చరింగ్ & ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీలో ఏడాది డిప్లొమా, ప్రొడక్షన్ సూపర్విజన్& క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులు చేసే గర్ల్స్‌కు ఈ స్కాలర్షిప్ వస్తుంది. ఇంటర్లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ గర్ల్స్‌కు కూడా స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంది.
అడ్మిషన్స్, ఇతర వివరాలకు: ఏటీడీసీ, సర్వే నెం. 64, సైబర్ టవర్స్‌కు సమీపంలో, హైటెక్‌సిటీ, మాదాపూర్, హైదరాబాద్–500081, ఫోన్ నెంబర్స్: 98850 89801, 99121 08844.
నా డ్రీమ్ ఫ్యాషన్ డిజైనర్
ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది నా డ్రీమ్. ఫ్రెండ్స్ ద్వారా ఏటీడీసీ హైదరాబాద్ గురించి తెలిసింది. వెంటనే ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అయ్యా. ప్లేస్‌మెంట్స్‌లో మా సీనియర్స్‌కు టాప్ కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి. నాకు కూడా ఫ్యాషన్ డిజైనర్‌గా అవకాశం వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది.
–నిఖిత, హైదరాబాద్, స్టూడెంట్
బెస్ట్ కెరీర్
టెన్త్, ఇంటర్ పూర్తి చేసిన స్టూడెంట్స్ కోసం ఏటీడీసీ షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ కోర్సులు అందిస్తోంది. కోర్సులు పూర్తి చేసిన వారికి అపరల్, టెక్స్టైల్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, రిటైల్ రంగాల్లో100 శాతం ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. ఆసక్తి గల స్టూడెంట్స్ ఏటీడీసీలో సంప్రదించాలి.
–రవి కిశోర్, రీజినల్ మేనేజర్ ఏటీడీసీ హైదరాబాద్
For More News..