అల్ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా

కొత్తపల్లి, వెలుగు:  అల్ఫోర్స్ మహిళా డిగ్రీ అండ్​ పీజీ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా నిర్వహించారు. 322 మంది స్టూడెంట్స్​ హాజరు కాగా 58 మంది ఎంపికైనట్లు కాలేజీ కరస్పాండెంట్ వి.రవీందర్​రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ విద్యాబోధనతో పాటు పోటీ పరీక్షలకు కావలసిన భాషా నైపుణ్యం, అర్థమెటిక్, రీజనింగ్, పర్సనాలిటీ డెవలప్​మెంట్​లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారన్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన స్టూడెంట్స్​ను అభినందించారు. టాస్క్ కోఆర్డినేటర్​ ఎ.గంగాప్రసాద్​, హెచ్ఆర్ మేనేజర్ నరేందర్, ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్​ బి.విజయలక్ష్మి, జి.చంద్రశేఖర్​రెడ్డి పాల్గొన్నారు.