జనవరి 31న జనగామలో జాబ్‌‌‌‌మేళా

జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాలోని నిరుద్యోగుల కోసం బుధవారం జాబ్‌‌‌‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ సీహెచ్‌‌‌‌.ఉమారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లోని ప్రముఖ ప్రైవేట్‌‌‌‌ కంపెనీల్లో సుమారు 280 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు.

అర్హత, ఆసక్తి గల వారు బయోడేటా, ఆధార్‌‌‌‌ కార్డుతో పాటు ఎడ్యుకేషనల్‌‌‌‌ సర్టిఫికెట్స్‌‌‌‌, ఫొటోతో ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌‌‌‌లోని రూం నంబర్ ఎస్‌‌‌‌ -29కు రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సీనియర్​అసిస్టెంట్ గీతను (79954 30401) సంప్రదించాలని తెలిపారు.