హనుమకొండ జిల్లా మడికొండలో జాబ్‌‌మేళా

కాజీపేట, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ఐటీ పార్కులోని క్వాండ్రంట్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ కంపెనీలో సోమవారం మెగా జాబ్‌‌మేళా నిర్వహించారు. తెలంగాణ అమెరికన్‌‌ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌‌మేళాలో 36 కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 1500 ఉద్యోగాల కోసం ముందస్తుగా ఆరు వేల మంది రిజిస్టర్‌‌ చేరుకున్నారు. కానీ అంతకుమించి నిరుద్యోగులు రావడంతో ఐటీ పార్క్‌‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌రెడ్డి మేళాకు హాజరై మాట్లాడారు. వరంగల్‌‌ వంటి నగరాల్లో ఐటీ హబ్‌‌ను డెవలప్‌‌చేసేందుకు కృషి చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో టీటీఏ ప్రెసిడెంట్‌‌ వంశీరెడ్డి, జనరల్‌‌ సెక్రటరీ కవితారెడ్డి, మోహన్‌‌రెడ్డి, నవీన్‌‌ మలిపెద్ది, సంతోష్‌‌రెడ్డి, జ్యోతి రెడ్డి, క్వాండ్రంట్‌‌ సంస్థ ఎండి మురళీధర్‌‌రెడ్డి పాల్గొన్నారు.