కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని సందీపని డిగ్రీ కాలేజీలో ఈ నెల 14న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సాయిబాబా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్సెంటర్ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన మేళా ఉంటుందన్నారు.
టెన్త్, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయినవారు ఈ మేళాకు హాజరవ్వాలని కోరారు. అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు.