వికారాబాద్ లో ఏప్రిల్ 10న జాబ్​ మేళా

వికారాబాద్ లో ఏప్రిల్ 10న జాబ్​ మేళా

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ఐటీఐ క్యాంపస్ ఆవరణలో ఈ నెల10న ఉదయం పదిన్నర గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ తెలిపారు. శ్రీ మంత్ర టెక్నాలజీస్ సంస్థలో సుమారు 50 బ్రాడ్ బ్యాండ్ టెక్నీషియన్, -డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, ఎంఐఎస్​డేటా అనలిస్ట్ జాబ్స్​ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆస్తకి ఉన్న 18 – 27 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యా అర్హతను బట్టి ఉచిత వసతితో కూడిన శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. పూర్తి సమాచారం కోసం 9676047444 నంబర్​ను సంప్రదించాలని సూచించారు.