హైదరాబాద్లో సెప్టెంబర్ 21న జాబ్ మేళా

హైదరాబాద్లో సెప్టెంబర్ 21న జాబ్ మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 21న జాబ్​మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్​మెంట్ ఆఫీసర్ వందన తెలిపారు. మల్లేపల్లిలోని ఎంప్లాయ్​మెంట్​ ఆఫీ సులో జాబ్​మేళా ఉంటుందన్నారు.

100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉదయం10 గంటలకు సర్టిఫికెట్లు, జిరాక్స్​కాపీలతో హాజరుకావాలన్నారు. వివరాల కు www.employment.telangana.gov.in వెబ్​సైట్ చూడాలని , లేదా 83284 28933 నంబర్​కు ఫోన్​చేయాలని సూచించారు.