
మెహిదీపట్నం, వెలుగు : మల్లేపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈ నెల 6న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హస్సేన్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జాబ్ మేళాలో 104 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఐటీఐ కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.