
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్జిల్లా ఉపాధి అధికారి వందన ప్రకటనలో తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని జిల్లా ఉపాధి ఆఫీసులో ఉదయం 10 గంటల నుంచి వైఎస్ఎఫ్ స్కిల్స్ కంపెనీలో 100 ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ మేళా ఉంటుందన్నారు. 8వ తరగతి నుంచి 10 తరగతి పాస్ లేదా ఫెయిల్, ఐటీఐ, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. వివరాలకు ఎంప్లాయిమెంట్వెబ్సైట్www.employment.telangana.gov.in లో లేదా ఫోన్ నంబర్ 8328428933 సంప్రదించాలన్నారు.