
బీఈసీఐఎల్‌లో 1100 ఖాళీలు
నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) 1100 స్కిల్డ్/అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు–ఖాళీలు: స్కిల్డ్ వర్కర్స్–400 (ఐటీఐ ఎలక్ర్టికల్/వైర్‌మెన్ ఉత్తీర్ణత. రెండేళ్ల అనుభవం తప్పనిసరి), అన్‌స్కిల్డ్–700 (8వ తరగతి పాస్, ఏడాది అనుభవం ఉండాలి); వయసు: స్కిల్డ్ మ్యాన్ పవర్‌కు 45, అన్‌స్కిల్డ్ కు 55 ఏళ్లకు మించకూడదు. చివరితేది: 2019 జూన్ 24; వివరాలకు: www.becil.com
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో..
ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) వివిధ విభాగాల్లో మేనేజర్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు–ఖాళీలు: సీనియర్ మేనేజర్(హెచ్ఆర్)–01, సీనియర్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–01, మేనేజర్ (ఎలక్ట్రికల్)–02, అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్)–03, ఇంజినీర్(సివిల్)–01, ఇంజినీర్(మెకానికల్)–02, ఇంజినీర్(కెమికల్)–04, ఇంజినీర్ (ఎలక్ట్రికల్)–02, ఇంజినీర్(ఇన్‌స్ట్రుమెంటేషన్)– 01, ఆఫీసర్ (కంపెనీ సెక్రెటేరియట్)– 01, మెడికల్ ఆఫీసర్ – 01; అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు తగిన పని అనుభవం తప్పనిసరి. ఫీజు: రూ.1000; చివరితేది: 2019 జూలై 4; ప్రింటవుట్ పంపడానికి: 2019 జూలై 7; వివరాలకు: www.nationalfertilizers.com
ఈసీఐఎల్‌లో ట్రేడ్స్‌మన్లు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటామిక్ ఎనర్జీకి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్–హైదరాబాద్) 50 ట్రేడ్స్‌మెన్–సి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రేడులు–ఖాళీలు: ఎలక్ట్రానిక్ మెకానిక్/ రేడియో&టీవీ–25, ఫిట్టర్–09, ఎలక్ట్రీషియన్–05, మెషినిస్ట్–03, వెల్డర్–04, మిల్‌రైట్ మెకానిక్–02, ఎలక్ట్రోప్లేటెర్–01, టర్నర్–01; చివరితేది: 2019 జూన్ 29; వివరాలకు: www.careers.ecil.co.in/login.php
ఈఎస్ఐసీలో ఫ్యాకల్టీలు
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కు చెందిన మెడికల్ కాలేజ్ కాంట్రాక్టు ప్రాతిపదికన 24 టీచింగ్, 130 నాన్ టీచింగ్, మొత్తం 154 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులు–ఖాళీలు: ప్రొఫెసర్–24, సీనియర్ రెసిడెంట్లు–54, సూపర్ స్పెషలిస్ట్‌లు–12, స్పెషలిస్ట్‌లు–3, జూనియర్ రెసిడెంట్లు–38, ట్యూటర్–23; అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎండీ/డీఎంతో పాటు తగిన అనుభవం ఉండాలి. వయసు: 69 సంవత్సరాలకు మించకూడదు. ఫీజు: రూ.225, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/మహిళలకు ఫీజు లేదు.); సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2019 జూన్ 24; ఇంటర్వ్యూలు: 2019 జూన్ 27 – ఆగస్టు 3; వివరాలకు: www.esic.nic.in/recruitments
బార్క్‌లో 74 పోస్టులు
భారత అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) 74 వర్క్ అసిస్టెంట్ (గ్రూప్–సి) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. వయసు: 2019 జూలై 1 నాటికి 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్/మహిళలకు ఫీజు లేదు. సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ద్వారా; చివరితేది: 2019 జూలై 01; వివరాలకు: www.recruit.barc.gov.in
ఎన్ఎస్పీవోఆర్ లో
గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (ఎన్‌సీపీవోఆర్) కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 32 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికయిన వారు అంటార్కిటికాలోని పరిశోధనా స్థావరాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టులు–ఖాళీలు: వెహికల్ మెకానిక్–2, వెహికల్ ఎలక్ట్రీషియన్–3, క్రేన్ ఆపరేటర్–2, స్టేషన్ ఎలక్ట్రీషియన్–1, జనరేటర్ మెకానిక్/ ఆపరేటర్–2, వెల్డర్–3, బాయిలర్ ఆపరేటర్–1, కార్పెంటర్–2, మల్టీటాస్కింగ్ స్టాఫ్–1, మేల్ నర్స్–3, ల్యాబ్ టెక్నీషియన్–2, కమ్యూనికేటర్–3, ఇన్వెంటరీ/ బుక్‌కీపింగ్ స్టాఫ్–2, చెఫ్/ కుక్–5; అర్హత: పోస్టును బట్టి ఆయా సబ్జెక్టులతో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు తగిన అనుభవం ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2019 జూన్ 28; ఇంటర్వ్యూతేది: 2019 జూలై 2 నుంచి 5 వరకు; వివరాలకు: www.ncaor.gov.in/recruitment
ఎన్సీఎఫ్ఎల్లో
2482 అప్రెంటీస్‌లు
మధ్యప్రదేశ్‌లోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎఫ్ఎల్) 2482 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులు–ఖాళీలు: వెల్డర్ (గ్యాస్/ఎలక్ట్రిక్)–162, ఎలక్ర్టీషియన్–1260, ఫిట్టర్–840, మోటార్ మెకానిక్–220; అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు: 16 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. చివరితేది: 2019 జూలై 10; వివరాలకు: www.nclcil.in
సెయిల్‌లో మెడికల్ ఆఫీసర్లు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 129 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: మెడికల్ ఆఫీసర్–54, మెడికల్ ఆఫీసర్ (ఓహెచ్ఎస్)–16, మెడికల్ స్పెషలిస్ట్–59; అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు ఆయా సబ్జెక్టుల్లో డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్, పీజీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత మరియు తగిన అనుభవం ఉండాలి. వయసు: మెడికల్ ఆఫీసర్లకు 30, స్పెషలిస్టులకు 37 ఏళ్లు; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2019 జూన్ 26; పరీక్షతేది: 2019 జూలై 21; వివరాలకు: www.sail.co.in
రిలయన్స్ ఇండస్ర్టీస్‌లో..
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ ఈ కామర్స్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్హత: కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వేతనం: నెలకు రూ.13000 మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్: రెండు రౌండ్లలో నిర్వహించే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివరితేది: 2019 జూన్ 17; వివరాలకు: www.ril.com, www.task.telangana.gov.in
మెరైన్ కెమికల్స్ ఇన్‌స్టిట్యూట్
సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ, గుజరాత్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్–06, టెక్నీషియన్–04; అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా సర్టిఫికెట్తో పాటు తగిన అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. చివరి తేది: 2019 జూలై 15; వివరాలకు: www.csmcri.org/Pages/Jobs/Jobs.php
షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటీస్‌లు
కొచ్చిలోని నేవల్ షిప్ రిపేర్ యార్డ్ (ఎన్ఎస్ఆర్వై) 172 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ఎలక్ట్రీషియన్–13, ఎలక్ర్టానిక్ మెకానిక్–17, మెషినిస్ట్–9, టర్నర్–7, వెల్డర్–10, పెయింటర్–8, ఎలక్ర్టోప్లేటర్–5, మోటార్ వెహికల్ మెకానిక్–2, ఎంఆర్ఏసీ–8, ఫిట్టర్–18, కంప్యూటర్ ఆపరేటర్–13, కార్పెంటర్–12, షీట్ మెటల్ వర్కర్–8, డీజిల్ మెకానిక్–16, టైలర్–4, కట్టింగ్–4, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్–6, ఎలక్ర్టీషియన్–6, రేడియో మెకానిక్–6; అర్హత: మెట్రిక్యులేషన్ /తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు: 2019 అక్టోబర్ 1 నాటికి 21 ఏళ్లకు మించకూడదు. శారీరక ప్రమాణాలు: ఎత్తు 150 సెం.మీ., 45 కేజీల కంటే ఎక్కువ బరువు, శ్వాస పీల్చినప్పుడు చెస్ట్ ఎక్స్‌పాన్సన్ 5 సెం.మీ. కలిగి ఉండాలి. చివరితేది: 2019 జూలై 23; వివరాలకు: www.davp.nic.in
ఐసీఎస్ఐలో నర్సింగ్ ఆపీసర్లు
న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్ఐఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన 69 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికయిన వారిని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నియమిస్తారు. అర్హత: బీఎస్సీ నర్సింగ్ లేదా పదోతరగతి ఉత్తీర్ణత మరియు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఢిల్లీ నర్సింగ్ కౌన్సిల్ రిజస్ర్టేషన్ తప్పనిసరి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఫీజు: రూ.1000; చివరితేది: 2019 జూన్ 17; వివరాలకు: www.icsil.in
ఎయిమ్స్‌లో 196 ఖాళీలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్–పట్నా) 196 వివిధ మెడికల్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: ఆయా సబ్జెక్టుల్లో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి. సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2019 జూలై 14; వివరాలకు: www.aiimspatna.org