పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల నోటిఫికేషన్స్

పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల నోటిఫికేషన్స్

ఎయిర్ ఇండియాలో 170 పోస్టులు

ఎయిర్ ఇండియా (ఏఐ) అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌‌ర్వీసెస్ లిమిటెడ్‌‌ కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న అసిస్టెంట్ సూప‌‌ర్‌‌వైజ‌‌ర్‌‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

రీజియన్​–ఖాళీలు:

ఈస్టర్న్‌‌     15           వెస్టర్న్‌‌     80

నార్తర్న్‌‌     50           స‌‌ద‌‌ర‌‌న్‌‌     25

అర్హత‌‌: ఏదైనా బ్యాచిలర్​ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్​ అప్లికేషన్స్‌‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్​ కోర్సు ఉత్తీర్ణత. కంప్యూటర్ రిలేటెడ్​ వర్క్​ లేదా డేటా ఎంట్రీ లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. లేదా ఎయిర్​క్రాఫ్ట్ మెయింటెనెన్స్​ ఇంజినీరింగ్​లో డిప్లొమాతో పాటు ఏవియేషన్​ రిలేటెడ్ సాఫ్ట్​వేర్​లో ఏడాది అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.

వ‌‌య‌‌సు: 33 సంవ‌‌త్సరాల లోపు.

ఫీజు: జనరల్/ఓబీసీలు రూ.1000, ఎస్సీ, ఎస్టీలు రూ.500 చెల్లించాలి.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్​లో నిర్వహించే స్కిల్​ టెస్ట్​ ద్వారా ఎంపిక చేస్తారు.

చివ‌‌రితేది: 2019 సెప్టెంబర్​ 28; ప‌‌రీక్షతేది: 2019 అక్టోబర్​ 20; వివరాలకు: www.airindia.in

 

ఓఐఎల్​లో సీనియర్ ఆఫీసర్లు

ఆయిల్​ ఇండియా లిమిటెడ్​ (ఓఐఎల్​) వివిధ విభాగాల్లో 58 సీనియర్ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

ఖాళీలు:

జియోలజీ                     13

జియోఫిజిక్స్​                18

రిజర్వాయర్​                    6

డ్రిల్లింగ్                             8

ప్రొడక్షన్                      13

అర్హత: జియోలజీ, జియోఫిజిక్స్​ కు ఆ సబ్జెక్టుల్లో పీజీ, మిగిలిన వాటికి  సంబంధిత బ్రాంచ్​లో ఇంజినీరింగ్​ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయసు: మొదటి రెండు పోస్టులకు 29, మిగిలిన వాటికి 27 ఏళ్లు మించకూడదు.

సెలెక్షన్ ప్రాసెస్: రిటెన్​ టెస్ట్​, గ్రూప్​ డిస్కషన్​, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

చివరితేది: 2019 సెప్టెంబర్ 28;

వివరాలకు: www.oil–india.com

 

టీఎస్ క్యాబ్లో స్టాఫ్ అసిస్టెంట్స్

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్​ అపెక్స్​ బ్యాంక్​ లిమిటెడ్​ (టీఎస్​సీఏబీ) 62 స్టాఫ్​ అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత: తెలంగాణ రాష్ర్టానికి చెంది ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. ఇంగ్లిష్ నాలెడ్జ్​ కలిగి తెలుగు భాషపై పట్టు, కంప్యూటర్స్ పై బేసిక్​ నాలెడ్జ్​ తప్పనిసరి.

వయసు: 2019 సెప్టెంబర్​ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫీజు: జనరల్​/బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌‌సర్వీస్​మెన్​ రూ.300 చెల్లించాలి.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ టెస్ట్​ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్​/ఫైనాన్షియల్​ అవేర్​నెస్​ నుండి 50, జనరల్​ ఇంగ్లిష్‌‌లో 40, రీజనింగ్​ ఎబిలిటీ అండ్​ కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​లో 50, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్​లో 50 మొత్తం 190 మార్కులకు 190 ప్రశ్నలిస్తారు. 0.25 చొప్పున నెగెటివ్​ మార్క్ ఉంది.

పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్​, నల్గొండ, కరీంనగర్​, నిజామాబాద్​, ఖమ్మం, వరంగల్.

చివరితేది: 2019  సెప్టెంబర్​ 30

పరీక్షతేది: 2019 నవంబర్​ 2

వెబ్​సైట్​: www.tscab.org

 

యూపీపీసీలో జూనియర్ ఇంజినీర్

ఉత్తరప్రదేశ్​ పవర్​ కార్పొరేషన్ లిమిటెడ్​ (యూపీపీసీ) 296 జూనియర్​ ఇంజినీర్​ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: ఎలక్ర్టికల్​ ఇంజినీరింగ్​లో డిప్లొమా ఉత్తీర్ణత; వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఫీజు: జనరల్​​/ఓబీసీలు/అదర్​ స్టేట్​ రూ.1000, ఎస్సీలు రూ.700 చెల్లించాలి. సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్​ రిటెన్​ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభం: 2019 సెప్టెంబర్​ 23;  చివరితేది: 2019 అక్టోబర్​ 16; వివరాలకు: www.upenergy.in

 

 

సీఏబీఎస్‌‌లో 20 జేఆర్ఎఫ్‌‌లు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌‌ల‌‌ప్‌‌మెంట్ ఆర్గనైజేష‌‌న్ (డీఆర్‌‌డీఓ) కు చెందిన సెంట‌‌ర్ ఫ‌‌ర్ ఎయిర్‌‌బోర్న్ సిస్టమ్ (సీఏబీఎస్‌‌) 20 జూనియ‌‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్‌‌లైన్​లో పోస్ట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు: క‌‌ంప్యూట‌‌ర్ సైన్స్–7, ఎల‌‌క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష‌‌న్–8, మెకానికల్–2, ఎల‌‌క్ట్రిక‌‌ల్ ఇంజినిరింగ్–2; అర్హత: పోస్టును బట్టి ఆయా బ్రాంచ్‌‌ల్లో బీఈ, బీటెక్​, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్​లో క్వాలిఫై అవ్వాలి. వ‌‌య‌‌సు: 28 ఏళ్లకు మించ‌‌కూడ‌‌దు. సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్​ మెరిట్​, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివరితేది: ఎంప్లాయ్​మెంట్ న్యూస్‌‌ సెప్టెంబ‌‌ర్ 7–13 ఎడిషన్​లో ఈ ప్రకటన వెలువడినప్పటినుండి 21 రోజుల్లోపు దరఖాస్తు చేయాలి. వివరాలకు: www.drdo.gov.in

 

 

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌‌

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌‌) పర్మనెంట్​ బేసిస్​ పై 28 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్‌‌–1)–14, ఎగ్జిక్యూటివ్‌‌ (గ్రేడ్​–2)–9, ఎగ్జిక్యూటివ్‌‌ (గ్రేడ్​–3)–5; అర్హత‌‌: పోస్టును బట్టి బీఈ/ బీటెక్‌‌/ బీఎస్సీ ఉత్తీర్ణత‌‌తో పాటు తగిన అనుభవం ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్​: షార్ట్‌‌లిస్ట్​ చేసి ఇంట‌‌ర్వ్యూ నిర్వహిస్తారు. చివ‌‌రితేది: 2019 సెప్టెంబర్​ 23; వివరాలకు: www.recruitment.eil.co.in

 

డీఎస్ఎస్ఎస్‌‌బీలో 778 టీచర్ పోస్టులు

ఢిల్లీ స‌‌బార్డినేట్ స‌‌ర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్​ (డీఎస్ఎస్ఎస్‌‌బీ) 778 అసిస్టెంట్​ టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: అసిస్టెంట్ టీచ‌‌ర్ (ప్రైమ‌‌రీ–637, న‌‌ర్సరీ–141); అర్హత‌‌: ఇంటర్/త‌‌త్సమాన ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్​ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​ పాసవ్వాలి. వ‌‌య‌‌సు: 30 ఏళ్లకు మించ‌‌కూడ‌‌దు. సెలెక్షన్ ప్రాసెస్: రిటెన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభం: 2019 సెప్టెంబర్​ 16; చివరితేది: 2019 అక్టోబర్​ 15; వివరాలకు: www.dsssb.delhi.gov.in

 

బీఈసీఐఎల్​లో 3 వేల పోస్టులు

న్యూఢిల్లీలోని బ్రాడ్​క్యాస్ట్​ ఇంజినీరింగ్​ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్​ (బీఈసీఐఎల్​) 3 వేల స్కిల్డ్, అన్​స్కిల్డ్​ మ్యాన్​పవర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: స్కిల్డ్​ మ్యాన్​పవర్​–1500, అన్‌‌స్కిల్డ్​–1500; అర్హత: స్కిల్డ్​ పోస్టులకు ఎలక్ట్రికల్​ లేదా వైర్‌‌‌‌మెన్​ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. సంబంధిత బ్రాంచ్​లో డిప్లొమా కలిగిన వారు కూడా అర్హులే. అన్‌‌స్కిల్డ్​ పోస్టులకు 8వ తరగతి పాసవ్వాలి. వయసు: 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్​లకు రూ.250; చివరితేది: 2019 సెప్టెంబర్​ 16; వివరాలకు: www.becil.com

నాబార్డ్‌‌లో అసిస్టెంట్స్

నేష‌‌న‌‌ల్ బ్యాంక్ ఫ‌‌ర్ అగ్రిక‌‌ల్చర్ అండ్ రూర‌‌ల్ డెవ‌‌ల‌‌ప్‌‌మెంట్ (నాబార్డ్‌‌) 91 డెవలప్​మెంట్​ అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: డెవల‌‌ప్‌‌మెంట్ అసిస్టెంట్‌‌–82, డెవ‌‌ల‌‌ప్‌‌మెంట్ అసిస్టెంట్ (హిందీ)–9; అర్హత‌‌: మొదటి పోస్టుకు ఏదైనా బ్యాచిల‌‌ర్స్ డిగ్రీ, రెండో పోస్టుకు ఇంగ్లిష్​తో పాటు హిందీ ఒక సబ్జెక్టుగా బ్యాచిల‌‌ర్స్‌‌ డిగ్రీ ఉత్తీర్ణత‌‌. వ‌‌య‌‌సు: 2019 సెప్టెంబర్​ 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబ‌‌ర్​ 14; చివరితేది: 2019 అక్టోబ‌‌ర్​ 2; వివరాలకు: www.nabard.org

వెస్ట్రన్ రైల్వేలో 99 ఖాళీలు

వెస్ట్రన్​ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌‌మెంట్ సెల్ (ఆర్ఆర్​సీ) 99 సీనియర్​ క్లర్క్​ కమ్​ టైపిస్ట్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: ఏదైనా బ్యాచిలర్​ డిగ్రీ ఉత్తీర్ణత‌‌తో పాటు హిందీ/ఇంగ్లిష్‌‌ టైపింగ్ సామర్థ్యం తప్పనిసరి. వ‌‌య‌‌సు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రిటెన్​ టెస్ట్​, టైపింగ్​ టెస్ట్​ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభం: 2019 సెప్టెంబ‌‌ర్​ 16; చివరితేది: 2019 అక్టోబర్​ 15; వివరాలకు: www.rrc–wr.com

డీఎస్ఎస్ఎస్‌‌బీలో 778 టీచర్ పోస్టులు

ఢిల్లీ స‌‌బార్డినేట్ స‌‌ర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్​ (డీఎస్ఎస్ఎస్‌‌బీ) 778 అసిస్టెంట్​ టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: అసిస్టెంట్ టీచ‌‌ర్ (ప్రైమ‌‌రీ–637, న‌‌ర్సరీ–141); అర్హత‌‌: ఇంటర్/త‌‌త్సమాన ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్​ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​ పాసవ్వాలి. వ‌‌య‌‌సు: 30 ఏళ్లకు మించ‌‌కూడ‌‌దు. సెలెక్షన్ ప్రాసెస్: రిటెన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభం: 2019 సెప్టెంబర్​ 16; చివరితేది: 2019 అక్టోబర్​ 15; వివరాలకు: www.dsssb.delhi.gov.in

ఆర్ఎఫ్‌‌సీఎల్‌‌లో 84 ఎగ్జిక్యూటివ్స్

రామ‌‌గుండం ఫెర్టిలైజ‌‌ర్స్ అండ్ కెమిక‌‌ల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌‌సీఎల్‌‌) వివిధ విభాగాల్లో 84 ఎగ్జిక్యూటివ్‌‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌‌లైన్ లేదా ఆఫ్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీలు: కెమిక‌‌ల్‌‌–25, మెకానిక‌‌ల్–5, ఎలక్ట్రిక‌‌ల్–4, ఇన్​స్ర్టుమెంటేషన్–8, సివిల్‌‌–1, కెమికల్​ ల్యాబ్​–8, మెటీరియల్స్​–6, మెడికల్​–4; అర్హత: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తర్ణత. సెలెక్షన్ ప్రాసెస్​: రిటెన్​, ట్రేడ్​ టెస్ట్​ ద్వారా; చివరితేది: 2019 అక్టోబర్​ 6; ప్రింటవుట్ పంపడానికి: 2019 అక్టోబర్​ 14; వివరాలకు: www.nationalfertilizers.com

బీవోబీలో సెక్టార్ స్పెషలిస్ట్స్

బ్యాంక్ ఆఫ్ బ‌‌రోడా (బీవోబీ) మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన 15 సెక్టార్ స్సెష‌‌లిస్ట్ క‌‌మ్ ప్రొడ‌‌క్ట్ మేనేజ‌‌ర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: గ్రాడ్యుయేట్‌‌/ ఇంజినీర్స్‌‌/ అగ్రిక‌‌ల్చర్ స్పెష‌‌లిస్ట్ ఉత్తీర్ణత. ఎంబీఏ కలిగి కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. చివరితేది: 2019 అక్టోబర్​ 1; వివరాలకు: www.bankofbaroda.in

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్లో

ఢిల్లీ సబార్డినేట్​ సర్వీస్​ సెలెక్షన్ బోర్డ్ 204 జూనియర్​ ఇంజినీర్​ (సివిల్​) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: సివిల్​ ఇంజినీరింగ్‌‌లో మూడేళ్ల డిప్లొమా లేదా నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సివిల్​ ఇంజినీరింగ్ రిలేటెడ్​ వర్క్స్​లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి ఫీజు లేదు. దరఖాస్తులు ప్రారంభం: 2019 సెప్టెంబర్​ 16; చివరితేది: 2019 అక్టోబర్​ 15; వివరాలకు: www.dsssb.delhi.gov.in

ఎంఎన్ఎన్ఐటీలో 108 ప్రొఫెస‌‌ర్స్

ఉత్తరప్రదేశ్‌‌లోని అల‌‌హాబాద్‌‌లో ఉన్న మోతీలాల్ నెహ్రూ నేష‌‌న‌‌ల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌‌జీ కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న 108 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌‌లైన్ / ఆఫ్‌‌లైన్‌‌లో అప్లై చేయాలి. అర్హత‌‌: ఆయా సబ్జెక్టుల్లో పీహెచ్‌‌డీ ఉత్తీర్ణత‌‌, తగిన అనుభవం ఉండాలి. ఫీజు: రూ.500; సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. చివరితేది: 2019 అక్టోబర్​ 4; వివరాలకు: www.mnnit.ac.in