కొలువులు మళ్లొస్తున్నయ్

కొలువులు మళ్లొస్తున్నయ్

జూన్‌తో పోలిస్తే జులైలో 5 శాతం పెరిగిన జాబ్‌ పోస్టింగ్స్‌
గతేడాదితో పోలిస్తే 47 శాతం డౌన్‌
పేర్కొన్న నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్

ముంబై: కీలక ఇండస్ట్రీలన్ని తిరిగి ప్రారంభంకావడంతో, ఉద్యోగ నియామకాలు ఊపందుకుంటున్నాయి. 2020 జూన్‌తో పోలిస్తే జులైలో హైరింగ్ యాక్విటీ 5 శాతం పెరిగినట్టు నౌకరిడాట్ కామ్ ఓ సర్వేలో వెల్లడించింది. జులైలో సుమారుగా 1,263 జాబ్ పోస్టింగ్‌‌ లు వచ్చాయని, ఇది జూన్‌లో వచ్చిన 1,203 కంటే కొద్దిగా ఎక్కువని నౌకరీ జాబ్ ‌‌స్పీక్ ‌ఇండెక్స్ ‌పేర్కొంది. అయినప్పటికీ ఏడాది ప్రాతిపదికన చూస్తే జులైలో హైరింగ్‌ యాక్విటీటి 47 శాతం తగ్గిందని ఈ ఇండెక్స్ తెలిపింది. నౌకరీ.కామ్‌‌వెబ్‌సైట్‌‌లో లిస్ట్‌ అయిన జాబ్స్‌ను బట్టి దేశంలో హైరింగ్ ‌‌యాక్విటీటిని నౌకరీ జాబ్ ‌‌స్పీక్‌ ఇండెక్స్‌ లెక్కిస్తుంది. గతేడాది జులైతో పోలిస్తే హోటల్‌, రెస్టారెంట్స్‌, ఎయిర్‌లైన్స్‌, ట్రావెల్ వంటి సెక్టార్ల నుంచి జాబ్ పోస్టింగ్స్ ‌ఈ జులైలో 80 శాతం తగ్గాయని ఈ ఇండెక్స్ తెలిపింది. రిటైల్‌(71శాతం), రియలెస్టేట్‌‌ (60 శాతం), ఆయిల్‌, గ్యాస్‌‌, పవర్ (58 శాతం) వంటి సెక్టార్ల నుంచి జాబ్స్ పోస్టిం గ్స్ ‌ఎక్కువగా తగ్గాయని తెలిపింది. ఐటీ ఎనబుల్డ్ ‌సర్వీసెస్‌‌(42 శాతం), ఎఫ్‌ఎంసీజీ (39 శాతం), ఫార్మా(38 శాతం), ఐటీ హార్వేర్‌డ్‌ (30 శాతం), హెల్త్‌‌కేర్‌(20 శాతం) సెక్టార్ల నుంచి కూడా జాబ్స్‌ పోస్టింగ్స్‌ తగ్గాయని పేర్కొంది.

ఈ సెక్టార్లలో పెరిగిన యాక్టివిటీ..

లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో, కన్‌‌స్ట్రక్షన్/ ఇంజనీరింగ్, మీడియా/ఎంటర్‌టైన్‌మెంట్, రిక్రూట్‌‌మెంట్/ఎంప్లాయిమెంట్ సెక్టార్ట‌లో హైరింగ్ యాక్విటీటి పెరిగిందని నౌకరి డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు. రిక్రూట్‌‌మెంట్‌‌(37 శాతం), మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌‌(36 శాతం), కన్‌‌స్ట్రక్షన్, ఇంజనీరింగ్‌‌(27శాతం) వంటి సెక్టార్ల నుంచి జాబ్స్‌ పోస్టింగ్స్‌ జూన్‌తో పోలిస్తే జులైలో పెరిగాయని పేర్కొంది. బ్యాంకింగ్‌ ఫైనాన్షియ‌ల్‌ సర్వీసెస్‌‌, ఇన్సూరెన్స్‌(16 శాతం), ఆటో(14 శాతం), టెలికాం(13 శాతం), ఐటీ హార్వేర్‌డ్‌ (9 శాతం) సెక్టార్ల‌లో కూడా హైరింగ్ ‌యాక్విటీటి పెరిగిందని ఈ ఇండెక్స్‌ పేర్కొంది. జూన్‌తో పోల్చుకుంటే జులైలో ఎడ్యుకేషన్‌(22శాతం), హాస్పిటాలిటీ(5 శాతం), రిటైల్‌(2 శాతం) లలో హైరింగ్ ‌‌యాక్విటీటి తగ్గింది. ‘ఇయర్ ఆన్ ఇయర్ పోలిస్తే హైరింగ్ యాక్విటీ 47 శాతం తగ్గింది.

ముందటి నెలతో పోలిస్తే కాస్త రికవరీ అయింది. ఎమర్జింగ్ సిటీలు జాబ్ మార్కెట్ రికవరీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెట్రో సిటీల్లోమాత్రం ఇంకా జాబ్ మార్కెట్ కోలుకోలేదు. మెట్రోల్లో హైరింగ్ యాక్విటీటిలు 50 శాతానికి పైగా పడిపోయాయి. చెన్నైలో 55 శాతం, ముంబైలో 54 శాతం, బెంగళూరులో 54 శాతం మేర తగ్గాయి. చిన్న నగరాలు చండీఘర్‌లో 28 శాతం, జైపూర్‌లో 25 శాతం, కొచ్చిలో 33 శాతమే హైరింగ్ యాక్విటీటిలు తగ్గాయి. మెట్రోలతో పోలిస్తే వీటిలో కాస్త తక్కువ ప్రభావమే ఉంది’ అని పవన్ గోయల్ అన్నారు.