ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పోస్టుల భర్తీలో రూల్6ఏ పాటించని ఆఫీసర్లు
హైకోర్టు ఆదేశించినా స్పందించని టీఎస్పీఎస్సీ
మహబూబ్‌నగర్, వెలుగు: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో టీఎస్పీఎస్సీ ఆఫీసర్లు రూల్6ఏ పాటించకపోవడంతో మెరిట్క్యాండిడేట్లు లాస్ అవుతున్నారు. జాబ్‌లో చేరకుండా వెళ్లిపోయిన వారి కారణంగా మిగిలిన 324 పోస్టులను తర్వాతి క్యాండిడేట్లతో భర్తీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడంతో అభ్యర్థులు ఏడాదిన్నర కారణంగా ఎదురుచూస్తున్నారు.
2017 లో నోటిఫికేషన్..
టీఎస్పీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో నోటిఫికేషన్ నంబర్: 48/2017 జారీ చేసింది. మొత్తం1857 పోస్టులకు వేలాది మంది నిరుద్యోగులు పోటీపడి, పరీక్షలు రాశారు. 2019లో రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ పోస్టులకు 1:2 రేషియోలో క్యాండిడేటర్లను ఇంటర్వ్యూలకు పిలిచారు. మొదట ఉద్యోగం పొందినవారిలో 324 మంది జాబ్‌లో జాయిన్‌కాలేదు. రూల్ ప్రకారం మెరిట్ లిస్ట్‌లో ఉన్న క్యాండెంట్లకు పిలిచి, ఉద్యోగాలివ్వాలి. కానీ నేటికీ పిలవకపోవడంతో ఆ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
హైకోర్టు ఆదేశించినా..
తమను ఇంటర్వ్యూకు పిలిచేలా టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోరుతూ పలువురు క్యాండిడేట్లు హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో మెరిట్ ప్రకారం అర్హులైనవారిని పిలిచి, పోస్టులు భర్తీచేయాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఇది జరిగిన ఏడాది దాటుతున్నా టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ లో ఉన్న 2,500 మంది క్యాండిడేట్లు పూర్తి అర్హతలతో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే సుమారు 100 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఆఫీసర్లు రూల్ 6 A పాటించి ఉంటే తాము ఈపాటికి ఉద్యోగాల్లో ఉండేవాళ్లమని చెబుతున్నారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ఆఫీసర్లు స్పందించి, మెరిట్‌లిస్టు ప్రకారం పోస్టులు భర్తీ చేయాలని క్యాండిడేట్లు డిమాండ్ చేస్తున్నారు.
మెరిట్‌లిస్టులో ఉన్నా..
కష్టపడి చదివి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి అన్ని అర్హతలు సాధించాను. మెరిట్ లిస్ట్‌లో ఉన్నాను. మిగిలిన పోస్టులు భర్తీ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. కానీ టీఎస్పీఎస్సీ ఆఫీసర్లు మాత్రం నాలాంటి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
–ఆనంద్‌కుమార్, మెరిట్ స్టూడెంట్, కోస్గి. మహబూబ్‌నగర్ జిల్లా
For More News..