అమెజాన్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు సిద్ధమవుతోంది. 2025 లో దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వర్క్ ఫోర్స్ లో 90వేల కు పైగా ఉద్యోగులను తొలగించేందకు అన్ని ప్రణాళికలు చేస్తోంది. అందులో దాదాపు 14వేల మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
2025లో కంపెనీ నిర్వహణ వ్యయం 3శాతం నుంచి 5శాతం వరకు తగ్గించేందుకు అమెజాన్ ప్రణాళికలు చేస్తోంది. కంపెనీ నిర్వహణ, స్కిల్స్ డెవలప్ మెంట్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తన వర్క్ ఫోర్స్ లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ చెబుతున్నారు.
ALSO READ | బీరూట్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. యుద్ధం ఆపాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు
ప్రస్తుతం అమెజాన్ కంపెనీ లో 1లక్షా 5వేల 770 మంది ఉద్యోగులున్నారు. దాదాపు 91వేల 936 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్దమవుతుంది. దీంతో 3.6 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంటున్నారు.
కంపెనీ తన వర్క్ ఫోర్స్ స్కిల్స్ ను ఎప్పటికపుడు పరీశీలిస్తుందని.. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది. అయితే ఎంత మందిని తొలగిస్తారనేది స్పష్టంగా ప్రకటించలేదు. ఉద్యోగుల తొలగింపుపై అధికారికంగా ఎటువంటి ప్రకటించలేదు.