ఎంపాకెట్‌‌‌‌లో 4 వేల మందికి జాబ్స్​!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  లోన్లు ఇచ్చే  ఎంపాకెట్‌‌‌‌  లోకల్ లాంగ్వేజ్‌‌‌‌లలో  కస్టమర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందించడానికి రెడీ అవుతోంది.  తెలుగు, కన్నడ, హిందీ వంటి లోకల్ లాంగ్వేజ్‌‌‌‌లలో సర్వీస్‌‌‌‌లు స్టార్ట్ చేయనుంది. విస్తరణపై ఫోకస్‌‌‌‌ పెట్టిన ఈ కంపెనీ 4 వేల మందిని నియమించుకోవాలని చూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి  హైదరాబాద్‌‌‌‌, భోపాల్‌‌‌‌, మైసూర్‌‌‌‌‌‌‌‌, విజయవాడ వంటి సిటీలలో ఈ ఉద్యోగులను నియమించుకుంటామని వెల్లడించింది.  తమ కస్టమర్లలో 35 – 40%  సౌత్ ఇండియా నుంచే ఉన్నారంది.

ALSO READ : నాయకులెవరూ మా ఊరికి రావొద్దు: కపూర్ నాయక్ తండావాసులు