ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

స్పోర్ట్స్ కోటా కింద హవల్దార్, నాయబ్​ సుబేదార్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

స్పోర్ట్స్ :  స్విమ్మింగ్, సెయిలింగ్, షూటింగ్, ట్రయాథ్లాన్, వాలీబాల్, వుషు, వెయిట్​ లిఫ్టింగ్, రెజ్లింగ్, వింటర్ గేమ్స్, రోయింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్​బాల్, బాక్సింగ్, డైవింగ్, ఫుట్​బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్​బాల్, జూడో, కయాకింగ్ అండ్​ కెనోయింగ్, కబడ్డీ.

ఎలిజిబిలిటీ :  పదో తరగతి/ ఇంటర్మీడియట్ ​ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఖేలో ఇండియా గేమ్స్ లేదా ఖేలో ఇండియ యూత్​ గేమ్స్​ లేదా ఖేలో ఇండియా యూనివర్సిటీ లేదా అంతర్జాతీయ/ జూనియర్​ లేదా సీనియర్ నేషనల్​ చాంపియన్​షిప్​లో పాల్గొన్న అత్యుత్తమ క్రీడాకారులై ఉండాలి. వయస్సు 17 సంవత్సరాల 6 నెలల నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్ :  స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్, ఫిజికల్​ స్టాండర్డ్స్ టెస్ట్, స్కిల్​టెస్ట్, మెడికల్​ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్​ వెరిఫికేషన్ల ద్వారా ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ : ఆఫ్​లైన్ ద్వారా పంపించాలి.