
ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: బీటెక్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్), పని అనుభవంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి. వయసు 35 సంవత్సరాలకు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మే 23 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.ntpc.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.