పలు విభాగాల్లో ఉద్యోగాలు

పలు విభాగాల్లో ఉద్యోగాలు

ఏపీ వార్డ్ స‌‌చివాల‌‌యాల్లో 2,146 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ క‌‌మిష‌‌న‌‌ర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిప‌‌ల్ అడ్మినిస్ట్రేష‌‌న్.. వార్డ్ స‌‌చివాల‌‌యాల్లో 2,146 వివిధ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు–ఖాళీలు: వార్డ్ అడ్మినిస్ట్రేటవ్ సెక్రట‌‌రీ–105, వార్డ్ ఎమినిటీస్ సెక్రట‌‌రీ–371, వార్డ్ శానిటేష‌‌న్ & ఎన్విరాన్‌‌మెంట్​ సెక్రట‌‌రీ–513, వార్డ్ ఎడ్యుకేష‌‌న్ & డేటా ప్రాసెసింగ్ సెక్రట‌‌రీ–100, వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేష‌‌న్ సెక్రట‌‌రీ–844, వార్డ్ వెల్ఫేర్ & డెవ‌‌ల‌‌ప్‌‌మెంట్ సెక్రట‌‌రీ–213; చివ‌‌రితేది: 2020 జనవరి 31; వివరాలకు: www.wardsachivalayam.ap.gov.in

నాబార్డ్‌‌లో 154 అసిస్టెంట్ మేనేజ‌‌ర్స్

ముంబ‌‌యి ప్రధాన‌‌కేంద్రంగా ఉన్న నేష‌‌న‌‌ల్ బ్యాంక్ ఫ‌‌ర్ అగ్రిక‌‌ల్చర్ అండ్ రూర‌‌ల్ డెవ‌‌ల‌‌ప్‌‌మెంట్‌‌(నాబార్డ్‌‌).. 154 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు–ఖాళీలు: రూర‌‌ల్ డెవ‌‌ల‌‌ప్‌‌మెంట్ బ్యాంకింగ్ స‌‌ర్వీస్‌‌–139, రాజ్‌‌భాష స‌‌ర్వీస్‌‌–08, లీగ‌‌ల్ స‌‌ర్వీస్‌‌–03, ప్రోటోకాల్ & సెక్యూరిటీ స‌‌ర్వీస్‌‌–04; చివ‌‌రితేది: 2020 జ‌‌న‌‌వ‌‌రి 31; వివరాలకు: www.nabard.org

హెవీ వాట‌‌ర్ బోర్డ్‌‌లో 277 పోస్టులు

డిపార్ట్​మెంట్ ఆఫ్ అటామిక్​ ఎనర్జీకి చెందిన హెవీ వాట‌‌ర్ బోర్డ్‌‌.. వివిధ హెవీ వాట‌‌ర్ ప్లాంట్స్​ & డీఏఈ యూనిట్లలో 277 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు: టెక్నిక‌‌ల్ ఆఫీస‌‌ర్​‌‌‘డీ’, స్టైపెండ‌‌రీ ట్రెయినీ, న‌‌ర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్‌‌, టెక్నీషియ‌‌న్‌‌‘సీ’, అప్పర్ డివిజ‌‌న్ క్లర్క్‌‌, డ్రైవర్​ కం పంప్​ ఆపరేటర్ కం ఫైర్​మెన్​ త‌‌దిత‌‌రాలు.

విభాగాలు/ట్రేడులు: కెమిక‌‌ల్‌‌, మెకానిక‌‌ల్‌‌, ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌, ఇనుస్ట్రుమెంటేష‌‌న్‌‌, కెమిస్ట్రీ, సివిల్‌‌, వెల్డర్, రిగ్గర్​, టర్నర్​, ప్లంబర్​, కార్పెంటర్.

అర్హత‌‌: ప‌‌దోత‌‌ర‌‌గ‌‌తి,  ఇంటర్​, సంబంధిత స‌‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్​ నాలెడ్జ్​, టైపింగ్ స్కిల్స్‌‌ కలిగి ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్​: రాత‌‌ప‌‌రీక్ష, స్కిల్ టెస్ట్‌‌, ఫిజిక‌‌ల్ అసెస్‌‌మెంట్ టెస్ట్ ద్వారా.

చివ‌‌రితేది: 2020 జనవరి 31.

వెబ్​సైట్​: www.hwb.gov.in

ఢిల్లీ పోలీస్‌‌లో 649 హెడ్ కానిస్టేబుల్స్

ఢిల్లీ పోలీస్.. దేశ‌‌వ్యాప్తంగా అర్హులైన స్త్రీ, పురుష‌‌ అభ్యర్థుల నుంచి 649 హెడ్​ కానిస్టేబుల్​(అసిస్టెంట్​ వైర్​లెస్​ ఆపరేటర్​/టెలీప్రింటర్​ ఆపరేటర్​) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల‌‌తో 10+2 ఉత్తీర్ణత‌‌/స‌‌ంబంధిత ట్రేడులో నేష‌‌న‌‌ల్ ట్రేడ్ స‌‌ర్టిఫికెట్‌‌(ఎన్‌‌టీసీ), టైపింగ్‌‌ నైపుణ్యం కలిగి ఉండాలి. వ‌‌య‌‌సు: 2019 జులై 1 నాటికి 18–27 ఏళ్ల మ‌‌ధ్య ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌ప‌‌రీక్ష ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు; చివ‌‌రితేది: 2020 జ‌‌న‌‌వ‌‌రి 27; వివరాలకు: www.delhipolice.nic.in

‌‌బ్ల్యూఐఐలో ప్రాజెక్ట్ ప‌‌ర్సనల్

దెహ్రాదూన్‌‌లోని వైల్డ్‌‌లైఫ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డ‌‌బ్ల్యూఐఐ).. క్లీన్​ గంగా ప్రాజెక్ట్​లో భాగంగా 29 కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ స్టాఫ్ భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్‌‌, వైల్డ్‌‌లైఫ్ బ‌‌యాల‌‌జిస్ట్‌‌, వెట‌‌ర్నరీ ఆఫీస‌‌ర్‌‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌‌, ప్రాజెక్ట్​ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌‌; అర్హత‌‌: స‌‌ంబంధిత స‌‌బ్జెక్టుల్లో బ్యాచిల‌‌ర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌ప‌‌రీక్ష, ప‌‌ర్సన‌‌ల్ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.100; చివ‌‌రితేది: 2020 జనవరి 23; వివరాలకు: www.wii.gov.in

ఐఓసీఎల్‌‌లో మెడిక‌‌ల్ ఆఫీస‌‌ర్స్

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియ‌‌న్ ఆయిల్ కార్పొరేష‌‌న్ లిమిటెడ్(ఐఓసీఎల్).. 25 మెడికల్​ ఆఫీసర్(గ్రేడ్​‘ఏ’)​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలు: గైనకాలజీ, జ‌‌న‌‌ర‌‌ల్ ఫిజిషియ‌‌న్‌‌, జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌ర్జన్, పీడియాట్రిక్స్‌‌, ఆర్థోపేడిక్స్​, అనస్థీషియా; అర్హత‌‌: స‌‌ంబంధిత స‌‌బ్జెక్టుల్లో ఎంబీబీఎస్‌‌, ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: ప‌‌ర్సన‌‌ల్ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.300, ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు; చివ‌‌రితేది: 2020 జ‌‌న‌‌వ‌‌రి 25; హార్డ్‌‌కాపీ పంప‌‌డానికి: 2020 జ‌‌న‌‌వ‌‌రి 31; వివరాలకు: www.tswreis.in

సీసీఐలో 75 పోస్టులు

కేంద్ర టెక్స్‌‌టైల్ మంత్రిత్వ శాఖ‌‌కు చెందిన ది కాట‌‌న్ కార్పొరేష‌‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌(సీసీఐ).. 75 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ కంపెనీ సెక్రట‌‌రీ, అసిస్టెంట్ మేనేజ‌‌ర్‌‌, మేనేజ్‌‌మెంట్ ట్రైనీ, జూనియ‌‌ర్ క‌‌మ‌‌ర్షియ‌‌ల్ ఎగ్జిక్యూటివ్‌‌, జూనియ‌‌ర్ అసిస్టెంట్‌‌, హిందీ ట్రాన్స్‌‌లేట‌‌ర్‌‌; అర్హత‌‌: స‌‌ంబంధిత స‌‌బ్జెక్టుల్లో బీకాం, బీఈ/బీటెక్​, ఎంబీఏ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్ ప్రాసెస్​: రాత‌‌ప‌‌రీక్ష ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.250; చివ‌‌రితేది: 2020 జనవరి 27; వివరాలకు: www.cotcorp.
org.in

ఫ్యాక్ట్‌‌లో 140 ఖాళీలు

కొచ్చిలోని ది ఫ‌‌ర్టిలైజ‌‌ర్స్ అండ్ కెమిక‌‌ల్స్ ట్రావెన్‌‌కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్).. 140 వివిధ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సీనియ‌‌ర్ మేనేజ‌‌ర్‌‌, అసిస్టెంట్ కంపెనీ సెక్రెట‌‌రీ, డిప్యూటీ మేనేజ‌‌ర్‌‌, అసిస్టెంట్ మేనేజ‌‌ర్‌‌, మేనేజ్‌‌మెంట్ ట్రెయినీ, టెక్నీషియ‌‌న్‌‌, డ్రాఫ్ట్స్‌‌మెన్‌‌, స్టెనోగ్రాఫర్ త‌‌దిత‌‌రాలు; అర్హత‌‌: ప‌‌దోత‌‌ర‌‌గ‌‌తి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్​, ఎంఈ/ఎంటెక్​ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్​లైన్​ టెస్ట్​, స్కిల్ టెస్ట్‌‌/ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జ‌‌న‌‌ర‌‌ల్/ఓబీసీలకు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌‌రితేది: 2020 జనవరి 22; వివరాలకు: www.fact.co.in

ఐసీఎస్ఐలో ఎగ్జిక్యూటివ్స్​

న్యూఢిల్లీలోని ది ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రట‌‌రీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ).. 14 ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌రఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: సంబంధిత స‌‌బ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌‌, పీజీ ఉత్తీర్ణత, పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: టెస్ట్‌‌/ఇంట‌‌ర్వ్యూ ద్వారా; చివ‌‌రితేది: 2020 జనవరి 27; వివరాలకు: www.icsi.edu

ఎయిమ్స్,రాయ్‌‌పూర్‌‌లో..

రాయ్‌‌పూర్‌‌(చ‌‌త్తీస్‌‌గ‌‌ఢ్‌‌)లోని ఆల్ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌‌ల్ సైన్సెస్‌‌(ఎయిమ్స్).. 31 సీనియర్​ రెసిడెంట్ గ్రూప్​ ‘ఎ’ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: బ‌‌యోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాల‌‌జీ, జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌ర్జరీ, మైక్రోబ‌‌యాల‌‌జీ, ఆఫ్తమాలజీ, ఆర్థోపేడిక్స్, సైకియాట్రీ, రేడియో థెరపీ త‌‌దిత‌‌రాలు; అర్హత: సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్​/డీఎన్​బీ/డిప్లొమా ఉత్తీర్ణత; వయసు: 2020 జనవరి 27 నాటికి 45 ఏళ్లు మించకూడదు; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.800, దివ్యాంగులకు ఫీజు లేదు; చివ‌‌రితేది: 2020 జనవరి 27; వివరాలకు:  www.aiimsraipursr.in

జిప్‌‌మ‌‌ర్‌‌, పుదుచ్చేరిలో..

పుదుచ్చేరిలోని జ‌‌వ‌‌హర్‌‌లాల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడిక‌‌ల్ ఎడ్యుకేష‌‌న్ అండ్ రీసెర్చ్‌‌(జిప్‌‌మ‌‌ర్‌‌).. 162 గ్రూప్​‘బీ’, ‘సీ’ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: న‌‌ర్సింగ్ ఆఫీస‌‌ర్‌‌, మెడిక‌‌ల్ సోష‌‌ల్ వ‌‌ర్కర్‌‌, జూనియ‌‌ర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫ‌‌ర్‌‌ గ్రేడ్​–2; చివ‌‌రితేది: 2020 జనవరి 27; వివరాలకు: www.jipmer.edu.in

పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో..

పార్లమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోని లోక్‌‌స‌‌భ సెక్రటేరియ‌‌ట్​.. 21 పార్లమెంటరీ రిపోర్టర్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌‌. వయసు: 2020 జనవరి 28 నాటికి 40 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌హ్యాండ్ టెస్ట్‌‌, రాత‌‌ప‌‌రీక్ష, ప‌‌ర్సన‌‌ల్ ఇంట‌‌ర్వ్యూ; చివ‌‌రితేది: 2020 జనవరి 28; వివరాలకు: www.loksabhadocs.nic.in

ఐటీఐ లిమిటెడ్‌‌లో..

బెంగ‌‌ళూరులోని ఇండియ‌‌న్ టెలిఫోనిక్ ఇండ‌‌స్ట్రీస్​ లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న 129 ఇంజినీర్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​/ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి.  అర్హత‌‌: బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత‌‌; వ‌‌య‌‌సు: 28 ఏళ్లలోపు; చివ‌‌రితేది: 2020 జనవరి 25; హార్డ్‌‌కాపీల‌‌కు: 2020 జనవరి 30; వివరాలకు: www.itiltd.in

ఈఐఎల్‌‌లో..

న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌‌.. 102 ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​ దరఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: సివిల్‌‌, మెకానిక‌‌ల్‌‌, ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌, వెల్డింగ్‌‌/ఎన్‌‌డీటీ, వేర్‌‌హౌజ్‌‌, సేఫ్టీ; అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణత, పని అనుభవం;​ చివ‌‌రితేది: 2020 జ‌‌న‌‌వ‌‌రి 22; వివరాలకు: www.engineersindia.com

సెయిల్​లో 105 ఖాళీలు

సెయిల్‌‌ పరిధిలోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్.. 105 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌‌ర్‌‌, మెడిక‌‌ల్ స‌‌ర్వీస్ ప్రొవైడ‌‌ర్‌‌, అటెండెంట్ క‌‌మ్ టెక్నీషియ‌‌న్; అర్హత‌‌: పదోతరగతి, డిప్లొమా/ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; చివ‌‌రితేది: 2020 జ‌‌న‌‌వ‌‌రి 27; వివరాలకు: www.sail.co.in