నిరుద్యోగులకు అండగా సీఎం రేవంత్​ ప్రభుత్వం..ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రోల్​మోడల్ ​

నిరుద్యోగులకు అండగా సీఎం రేవంత్​ ప్రభుత్వం..ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రోల్​మోడల్ ​

గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులకు అండగా నిరంతరం ఉండేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని ఇప్పటికే నిరూపణ అయింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, వారి సమస్యలను సానుకూల వాతావరణంలో పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తూ వస్తున్నది. స్కిల్​ యూనివర్సిటీ స్థాపన నిరుద్యోగులకు గొప్ప మలుపు.  నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేక విజన్​ రూపొందించిన రేవంత్​ సర్కార్​ను అభినందించాలి. 

సుమారు 55 వేల ఉద్యోగ నియామకాలు చేసి, ఏటా జాబ్​ క్యాలెండర్​ను ప్రకటించడం చిన్న విషయం కాదు. ఆ క్రెడిట్​ రేవంత్​ సర్కారుకు దక్కింది.  ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీపై దృష్టి పెట్టడంతోపాటు మరోవైపు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు దృఢసంకల్పంతో ప్రభుత్వం పనిచేయడాన్ని గమనించొచ్చు. పరిశ్రమల ఏర్పాటు వల్ల ప్రైవేటు సెక్టార్​లోనూ నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఉద్యోగాల కల్పనలో దేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించింది.

గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల కాలంలో 50 వేల  ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు.   కేవలం సంవత్సరానికి 5వేల జాబ్​లు కూడా భర్తీ చేయలేకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం. నిరుద్యోగులను  తెలంగాణ ఉద్యమంలో వాడుకొని వదిలేశారు. ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. కాంగ్రెస్​  ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నది.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవు. 

ఒక్క ఏడాదిలో 55 వేల ఉద్యోగాల భర్తీ

పదేండ్ల తెలంగాణలో ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రేవంత్​ సర్కారుకే దక్కుతుంది.  పోలీసు, వైద్యారోగ్య, గురుకుల సొసైటీల్లో  పెండింగ్‌‌లో ఉన్న 29,384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి, ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. 

సింగరేణి సంస్థలో 441 మందికి కారుణ్య నియామకాలను కల్పించింది. టీఎస్‌‌పీఎస్సీ బోర్డును పునర్వ్యవస్థీకరించింది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు, రూ.2,700 కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

గత పదేళ్ల కాలంలో కేవలం 50వేల ఉద్యోగాలను సైతం భర్తీ చేయని అసమర్థులు బీఆర్ఎస్​ నేతలు. ఎన్నికల ముందు కాంగ్రెస్​ హామీ ఇచ్చిన విధంగానే నిరుద్యోగులకు కాంగ్రెస్​ అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లకు ఈ విషయం తప్పక గుర్తుందనడంలో సందేహం లేదు. 

ఉద్యోగాల భర్తీకి  రోడ్​మ్యాప్.. జాబ్ క్యాలెండర్​

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక రోడ్​ మ్యాప్​ రూపొందించేందుకు జాబ్​ క్యాలెండర్​ను  కాంగ్రెస్​ సర్కారు​ విడుదల చేసింది. ఇది అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశపెట్టడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం.  కాంగ్రెస్​ ప్రభుత్వం పారదర్శకంగా నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం నిరుద్యోగుల్లో ఒక భరోసాను నింపింది.  

ఈ క్యాలెండర్‌‌లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలు, పోలీసు, గురుకులాలు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు వంటి వివిధ విభాగాల ఖాళీల వివరాలు ఉంటాయి. ఈ క్యాలెండర్‌‌లో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది.. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి.. నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది.. వంటి వివరాలు స్పష్టంగా ఉంటాయి. 

ఇది నిరుద్యోగులు తమ ప్రణాళికలను సక్రమంగా రూపొందించుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. జాబ్​ క్యాలెండర్​ ప్రకారం ఏయే జాబ్​కు అలా ప్రిపేరు కావొచ్చు నిరుద్యోగులు. దాని ప్రకారం పోటీ పరీక్షలతోపాటు వివిధ ఉద్యోగాల కల్పనకు తగిన శిక్షణ పొందనున్నారు. రేవంత్​రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి జాబ్​ క్యాలెండర్​ రూపకల్పన చేసింది. దీంతో ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తోంది. 

పనిచేస్తున్న సర్కారుకే  అండగా..

నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు గాడ్​ఫాదర్​గా  కాంగ్రెస్​ ప్రభుత్వం నిలుస్తున్నది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటురంగంలోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు సర్కారు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ  ప్రయాణం సాగిస్తున్నది.  గ్రాడ్యుయేట్, టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్​, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్​ పార్టీకి అండగా నిలిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. 

ఉద్యోగాలు కల్పించిన, కల్పించనున్న రేవంత్​ సర్కార్​ పట్ల నిరుద్యోగులు, ఉద్యోగులు తప్ప అండగా నిలుస్తారనడంలో సందేహం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఆదరణ సహజంగానే కాంగ్రెస్​ పార్టీకే ఉండే అవకాశాన్ని ఎవరూ కొట్టేయలేరు. ​ రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంది కనుక.. నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగ ఉపాధ్యాయులు సమస్యలను ఆలకిస్తుంది. సానుకూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం ఇస్తుంది. గత సర్కారు వ్యవహరించినట్లు కాకుండా అలవోఈకగా వాటికి పరిష్కార మార్గం అన్వేషిస్తుంది. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. కాంగ్రెస్​కు ఇతర పార్టీలకు తేడా అదే. 

​ఉద్యోగులందరికీ  పదోన్నతులు 

రెండు దశాబ్దాలుగా పెండింగ్​లో ఉన్న ఉపాధ్యాయులకు సర్కారు పదోన్నతులు కల్పించింది. బీఆర్ఎస్​ సర్కారు పదేళ్లకాలంలో టీచర్ల  పదోన్నతులు, బదిలీలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఏమాత్రం పట్టించుకోలే. కాంగ్రెస్​ సర్కారు అవకాశం కల్పించడంతో  సుమారు 21,419 మందికి పదోన్నతులు లభించాయి. వాటి ఊసే ఎత్తకపోతే వారు పదోన్నతి పొందేవారు కాదు. 37,406 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను, 2,757 మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు చేశారు. 

11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది కాంగ్రెస్​ సర్కారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తున్నది. ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్​కు అండగాఉద్యోగ నిరుద్యోగ వర్గాలు నిలుస్తారని విశ్లేషకులూ చెపుతున్నారు. ఇప్పటికే కల్పించిన 55 వేల ఉద్యోగాలే కాదు..కాంగ్రెస్​ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జాబ్​ల రిక్రూట్​మెంట్​కు సన్నాహాలు చేస్తోంది. 

టీచర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తోంది.  కాంగ్రెస్​ పార్టీ  నిత్యం నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లకు వారి పాలిట శ్రీరామ రక్షగా వెన్నంటే ఉంటుంది.  గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, టీచర్లు,  నిరుద్యోగులు  ఈ నిజాన్ని మాత్రం మరవరనే  అభిప్రాయం  సర్వత్రా  వినిపిస్తున్నది.

దావోస్​ పర్యటనతో పెట్టుబడుల వరద..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం ఇటీవల దావోస్‌‌లో పర్యటించారు. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025 వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో, రాష్ట్రానికి సుమారు ₹1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. 

దేశ చరిత్రలోనే  తెలంగాణకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం విశేషం. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో అత్యధికంగా ఉండడం.. ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్​ తెలంగాణలో ఉండడం పెట్టుబడులు అధికంగా వచ్చేలా కలిసి వచ్చింది.  ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్​బాబు నేతృత్వంలో బృందం మొత్తం 16 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

వీటిలో వినియోగ వస్తువుల తయారీలో ప్రముఖ సంస్థ యూనిలీవర్ కూడా ఉంది. యూనిలీవర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో ఐటీ, కృత్రిమ మేధస్సు, ఇంధన రంగాలు వంటి విభాగాల్లో అభివృద్ధికి దోహదపడనున్నాయి.16 కంపెనీలతో ఒప్పందాలు, ₹1.78 లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల ప్రత్యేక్షంగా,  పరోక్షంగా దాదాపు  లక్ష వరకు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇది కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఒక గొప్ప మై‌‌‌‌లురాయి కానుంది.  



- వెలిచాల రాజేందర్​రావు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జ్​-