వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
  • వీఆర్ఏ జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్  

వికారాబాద్, వెలుగు: 61 ఏండ్ల వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ -జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ప్రతీక్ జైన్​కు సోమవారం వినతిపత్రం అందజేశారు. 2020 సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి, హామీల అమలులో విఫలమైందన్నారు. 

ఆ తర్వాత 80 రోజులు వీఆర్ఏలు ధర్నా చేయగా, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి జీవో నంబర్​ 81,85లను విడుదల చేశారన్నారు. ఈ జీవో ప్రకారం వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఇతర శాఖలకు బదిలీ చేసిందని, కానీ వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఎల వారసులకు ఉద్యోగాల ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.