
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్
రెండో వరల్డ్ టెస్ట్చాంపియన్షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్‌పై 209 పరుగులతో ఆస్ట్రేలియా గెలుపొందింది. దీంతో ఐసీసీ నిర్వహించే అన్ని టైటిల్స్ సాధించిన తొలి జట్టుగా ఆసీస్ నిలిచింది.
ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్స్
సెర్బియా స్టార్ జొకొవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై విజయం సాధించి అత్యధిక గ్రాండ్ స్లామ్స్(23) గెలుచుకున్న ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వైటెక్, కరోలినా ముకోవాపై విజయం సాధించింది.
నేషనల్ కేరళలో ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
అక్షరాస్యతలో అందరి కంటే ముందున్న కేరళ ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి, అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రజల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేలా కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్‌వర్క్‌ను (కేఎఫ్‌ఓఎన్) ఆరంభించింది.
విలువైన బ్రాండ్‌గా టాటా
భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. బ్రాండ్ విలువ 2022తో పోలిస్తే 10.3% వృద్ధి చెంది 26.38 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.16 లక్షల కోట్ల)కు చేరింది. ఇన్ఫోసిస్ రెండో స్థానంలో, ఎయిర్‌టెల్ 4వ, జియో గ్రూప్ 11వ స్థానంలో ఉన్నాయి. బ్యాంకుల్లో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది.
‘అహిల్యాదేవి హోల్కర్’ గా అహ్మద్‌నగర్
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పేరును ఇకపై అహిల్యాదేవి హోల్కర్ జిల్లాగా మార్చినట్లు సీఎం ఏక్‌నాథ్ శిండే ప్రకటించారు. 18వ శతాబ్దానికి చెందిన ఇందౌర్ రాజ్య దిగ్గజ పాలకురాలే అహిల్యాదేవి (అహిల్యాబాయి). శిండే సర్కారు ఇదివరకే ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది.
ఐఐఎఫ్‌ఏ పురస్కారాలు
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఐఎఫ్‌ఏ) పురస్కారాల్లో ‘గంగూభాయి కథియావాడీ’ అత్యధిక విభాగాల్లో అవార్డులు గెల్చుకుంది. హృతిక్ రోషన్, అలియా భట్‌లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం - దృశ్యం 2, ఉత్తమ దర్శకుడిగా -ఆర్.మాధవన్‌కు (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్) అవార్డులు దక్కాయి.
వ్యక్తులు
జోయితా గుప్తా
భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తాకు ‘డచ్ నోబెల్ ప్రైజ్’ దక్కింది. నెదర్లాండ్స్‌లో సైన్స్ రంగంలో కృషి చేసే వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు అసలు పేరు స్పినోజా ప్రైజ్ కాగా, డచ్ నోబెల్ ప్రైజ్‌గా పిలుస్తారు.
రాజాబాబు
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌లోని క్షిపణులు, ప్యూహాత్మక వ్యవస్థల (ఎంఎస్‌ఎస్) డైరెక్టర్ జనరల్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా ఉన్న ఆయన పదోన్నతిపై డీజీ అయ్యారు.
ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆర్ దినేశ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ బాధ్యతలు స్వీకరించారు.
ద్రౌపదీ ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సురినాం అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద ఛైన్ ఆఫ్ ద యెల్లో స్టార్’ను ఆ దేశ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోకీ అందజేశారు. రెండు దేశాల బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు గౌరవ చిహ్నంగా పురస్కార ప్రదానం జరిగింది.
తెలంగాణ ఎఫ్‌డీఐల్లో ఏడో స్థానం
గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానాల్లో నిలిచాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.10,319 కోట్లు వచ్చాయి.
నిర్మల్‌లో నాట్య శివుని ప్రతిమ గుర్తింపు
నిర్మల్ జిల్లాలోని కదిలె పాపహరేశ్వర శివాలయంలో11వ శతాబ్దానికి చెందిన నాట్య శివుని విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు తుమ్మల దేవరావ్ తెలిపారు.
ఇంటర్నేషనల్
తుర్కియే అధ్యక్షుడిగా ఎర్డోగాన్
తుర్కియే ఎన్నికల్లో అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి విజయం సాధించారు. రెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్ తుర్కియే పాలకుడిగా కొనసాగుతున్నారు. ప్రధానిగా, అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశిస్తారు.
అత్యంత ఖరీదైన నగరాలు
‘మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఖరీదైన నగరాల్లో హాంకాంగ్, సింగపూర్, జూరిచ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ముంబయి 147, ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202 స్థానాల్లో నిలిచాయి.
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవ్‌షా
అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్ షా చాంపియన్‌గా నిలిచాడు. అతడు శామాఫైల్ అనే పదానికి స్పెల్లింగ్ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్ అంటే ఇసుక నేలల్లో కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం.
సైన్స్ అండ్ టెక్నాలజీ
‘అగ్ని ప్రైమ్’ సక్సెస్
అణ్వాయుధాన్ని మోసుకెళ్లగల అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను భారత్ అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని ప్రైమ్ 1,000- నుంచి 1,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.