- ప్రముఖ తెలంగాణ నాయకుడు మాడపాటి హన్మంతరావుకు ఆంధ్ర పితామహుడు అనే బిరుదు ఉంది.
- హైదరాబాద్ సంస్థానం పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం తరగుతులు ప్రారంభం కావడానికి ముందు నిజాం రాజును కీర్తిస్తూ ప్రార్థనా గీతం పాడేవారు.
- హైదరాబాద్ సంస్థానానికి వెలుపల మాడపాటి హన్మంతరావు, వామన్ రాఘవేంద్రరావు సమావేశాలు జరిపేవారు.
- 1938లో దసరా పండుగ నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం బి హాస్టల్ విద్యార్థులు వందేమాతరం గీతాన్ని పాడారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్ విద్యార్థులు 1938 నవంబర్ 28న వందేమాతరం ఉద్యమం లేవదీశారు.
- వందేమాతరం ఉద్యమం నేపథ్యంలో 1938 నవంబర్ 29 ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్ విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించారు.
- వందేమాతరం ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో 1938 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు విద్యార్థులు సమ్మె నిర్వహించారు.
- వందేమాతర ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించిన విద్యార్థులకు నాగపూర్ విశ్వవిద్యాలయం అడ్మిషన్లు కల్పించింది.
- వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ ప్రముఖ జాతీయ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లేఖలు పంపారు.
- వందేమాతరం గీతాన్ని పాడుకునే హక్కు భారతీయ విద్యార్థులందరికీ ఉందని మహాత్మా గాంధీ ప్రకటించారు. వందేమాతరం ఉద్యమంలో విద్యార్థి నాయకులు పీవీ నరసింహారావు, నూకల రామచంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, టి.హయగ్రీవాచారి, డి.వెంకటేశ్వర్లు, అచ్యుతరెడ్డి, సర్వేదేవభట్ట రామనాథం, మర్రి చెన్నారెడ్డి చురుగ్గా పాల్గొన్నారు.
- తెలంగాణలో కమ్యూనిస్టు విద్యార్థి ఉద్యమం ఆవిర్భావానికి ముఖ్దూం మొయినుద్దీన్, ఓంకార్ ప్రసాద్, జవ్వాద్ కృషి చేశారు.
- 1943లో ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని ముఖ్దూం మొయినుద్దీన్ నిర్మించారు.
- హైదరాబాద్ నగరంలో సోషలిస్టు భావాలు కలిగిన వారు కలిసి కామ్రేడ్స్ అసోసియేషన్ అనే ప్రజా సంఘం ఏర్పాటు చేశారు.
- భారత ప్రభుత్వ సైనిక చర్య సమయంలో కామ్రేడ్స్ అసోసియేషన్ నాయకులు ఆజాద్ హైదరాబాద్‌కు పిలుపు ఇచ్చారు.
- ఎల్లా ప్రగడ సీతాకుమారి, అనంత లక్ష్మీదేవి, గద్వాల మహారాణి ఆది లక్ష్మీదేవి కలసి 1935లో నిజామాంధ్ర యువతీ మండలి సంఘం ఏర్పాటు చేశారు.
- నిజాం ఆంధ్ర యువతీ మండలికి తొలి అధ్యక్షురాలు గద్వాల మహారాణి ఆది లక్ష్మీదేవి.
- నిజాం ఆంధ్ర యువతీ మండలి కార్యాలయం హైదరాబాద్‌లోని బొగ్గులకుంట రెడ్డి హాస్టల్లో ఉండేది.
- నిజాం ఆంధ్ర యువతీ మండలి భవనాన్ని 1952లో స్థాపించారు.
- నిజాం ఆంధ్ర యువతీ మండలి శిశువికాస్ విహార్‌ను 1955లో నెలకొల్పింది.
- తెలంగాణ తొలి తరం దళిత ఉద్యమకారుల్లో అగ్రగణ్యుడు భాగ్యరెడ్డి వర్మ.
- అంబేద్కర్ కంటే ముందే భారతదేశ అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ.
- భారతదేశంలో అణగారిన, అంటరాని పంచ మ కులాలుగా గుర్తించిన వారిలో చైతన్యం తీసుకురావడానికి భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించాడు.
- భాగ్యరెడ్డి వర్మ మొదటిసారిగా హైదరాబాద్‌లోని ఇసామియా బజార్లో అంటరాని వర్గాల కోసం 1910లో పాఠశాలను స్థాపించాడు.
- ఆది హిందూ పాఠశాలల నిర్వహణకు దక్కన్ హ్యూమనేటేరియన్ లీగ్, జీవరక్ష జ్ఞాన ప్రచార మండలి సహకారం అందించింది.
- ఆది హిందూ పాఠశాల నిర్వహణను నిజాం ప్రభుత్వం 1934లో స్వీకరించింది.
- ఆది హిందువుల అభివృద్ధి కోసం భాగ్యరెడ్డి వర్మ 1911లో హిందూ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపించారు.
- ఆది హిందువులను సబ్బండ వర్ణాల వారితో కలిపి సహపంక్తి భోజనాలు చేయించి కుల నిర్మూలనకు, అంటరానితనం తొలగింపు కోసం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారు.
- 1917లో విజయవాడలో ప్రథమ ఆంధ్ర ఆది హిందూ సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించాడు.
- 1917లో విజయవాడలో జరిగిన ఆంధ్ర ఆది హిందూ సదస్సులో భాగ్యరెడ్డి వర్మ ప్రసంగానికి ప్రేరణ పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అనే నవలను రచించాడు.
- 1917లో కలకత్తాలో జరిగిన అఖిల భారత హిందూ సంస్కరణ సభలో భాగ్యరెడ్డి వర్మ ప్రసంగానికి గాంధీ ఆకర్షితులయ్యారు.
- దళిత ఉపకులాల మధ్య సమన్వయం కోసం 1919లో భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు.
- భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఆది హిందూ లీగ్ 1921 నుంచి 1924 వరకు వరుసగా సమావేశాలు జరిపింది.