
ట్రేడ్‌మెన్, టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1230 పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో తెలంగాణలో 48, ఆంధ్రప్రదేశ్‌లో 64 చొప్పున పోస్టులు ఉన్నాయి.
పోస్టులు: రైఫిల్‌మెన్, హవిల్దార్, నైబ్ సుబేదార్, రైఫిల్‌ఉమెన్
ట్రేడులు: క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, లైన్మెన్ ఫీల్డ్, వెహికల్ మెకానిక్
అర్హతలు: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
రాతపరీక్ష: మొత్తం 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది.
ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్: పురుషులు 5 కి.మీ. పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. స్త్రీలు 1.6 కి.మీ. పరుగు 8.30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.200
చివరితేదీ: 25 అక్టోబర్
వెబ్‌సైట్: www.assamrifles.gov.in