ఇంటర్ అర్హతతో CSIR -NAL లో ఉద్యోగాలు..స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఇంటర్ అర్హతతో CSIR -NAL లో ఉద్యోగాలు..స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బెంగళూరులోని సీఎస్ఐఆర్– నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ(సీఎస్ఐఆర్–ఎన్ఏఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య: 26

పోస్టులు: జూనియర్​ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్) 09, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎఫ్ అండ్ ఏ) 7, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ అండ్ పీ) 05, జూనియర్ స్టెనోగ్రాఫర్ 05
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ వచ్చి ఉండాలి. 2025, మే 30వ తేదీ నాటికి జేఎస్ఏకు 28 ఏండ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్​కు 27 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 16. 
లాస్ట్ డేట్: మే 20
సెలెక్షన్ ప్రాసెస్:  రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
జీతం: జేఎస్ఏ పోస్టులకు నెలకు రూ.19,900– రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్​కు రూ.25,500 – రూ.81,100.

మద్రాస్ కాంప్లెక్స్ లో..

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చెన్నైలోని సీఎస్ఐఆర్ – మద్రాస్ కాంప్లెక్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 19వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 
పోస్టుల సంఖ్య: 08 
పోస్టులు: జూనియర్​ సెక్రటేరియట్ అసిస్టెంట్
(జనరల్) 01, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎఫ్ అండ్​ ఏ)  02,  జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ అండ్ పీ) 05, జూనియర్ స్టెనోగ్రాఫర్ 04.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ వచ్చి ఉండాలి. 2025, మే 30వ తేదీ నాటికి జేఎస్ఏకు 28 ఏండ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్ కు 30 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 17.
లాస్ట్ డేట్: మే 19
సెలెక్షన్ ప్రాసెస్: ప్రొఫీషియన్సీ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.