దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా నిన్న(జనవరి 29) జరిగిన మ్యాచ్ లో బౌండరీలతో స్టేడియం హోరెత్తింది. జోబర్గ్ సూపర్ కింగ్స్, MI కేప్ టౌన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ ఆటగాళ్లు పెను విధ్వంసమే సృష్టించారు. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ టార్గెట్ ను 8 ఓవర్లలో 98 పరుగులుగా నిర్ధేశించారు. చేతిలో 10 వికెట్లు ఉండడటంతో సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. లక్ష్యాన్ని 5.4 ఛేజ్ చేసి ముంబైకి షాక్ ఇచ్చారు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 20 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 50 పరుగులు చేస్తే.. మరో ఓపెనర్ డు ప్లూయ్ 14 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. తొలి బంతి నుంచే సూపర్ కింగ్స్ విధ్వంసం ప్రారంభమైంది. తొలి రెండు బంతులకు సిక్సర్లు కొట్టడంతో మొత్తం ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చి చేరాయి. వీరిద్దరి ధాటికి స్టార్ బౌలర్ రబడా 2 ఓవర్లలో 38 పరుగులు సమర్పించుకున్నాడు. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ అసాధారణ ఆట తీరును ప్రదర్శించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన MI కేప్ టౌన్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసిన తర్వాత వర్షం పడింది. ఈ దశలో డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. ముంబై కెప్టెన్ పొలార్డ్ ధాటికి చివరి రెండు ఓవర్లలో 37 పరుగులు చేయడంతో నిర్ణీత 8 ఓవర్లలో 80 పరుగులు చేసింది. పొలార్డ్ 10 బంతుల్లోనే 4 సిక్సులతో 30 పరుగులు చేశాడు.
JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. ?
— Johns. (@CricCrazyJohns) January 30, 2024
- Madness from Faf Du Plessis & Du Plooy...!!!!pic.twitter.com/M1t9aqaG0x
Faf du Plessis and Leus du Plooy of Joburg Super Kings unleashed a boundary blitz, dazzling spectators with their exceptional batting and chased down 98 runs in just 5.4 overs ? pic.twitter.com/oJX1994TDj
— CricTracker (@Cricketracker) January 30, 2024