ట్రంప్ పై కాల్పులు.. స్పందించిన బైడెన్, ఒబామా..

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన ఘటనపై బైడెన్, ఒబామాలు స్పందించారు.అమెరికాలో హింసకు తావు లేదని బైడెన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా తెలిసిందని, ట్రంప్.. ఆయన కుటుంబం కోసం దేవుడిని ప్రార్దిస్తున్నాని అన్నారు.అందరం ఒక్కటై ఖండించాలని ట్వీట్ చేశారు బైడెన్.

ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని, ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. 
ట్రంప్ పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ట్రంప్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాల్పులతో అపరమత్తమైన భద్రతా సిబ్బంది హుటాహుటిన ట్రంప్ ను ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్ చెవికి తాకటంతో ట్రంప్ చెవి భాగాన గాయమైంది. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.