న్యూయార్క్: అమెరికాను పాలించేందుకు ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు అర్హత లేదని, ఆమె తీవ్రమైన వామపక్ష ఉన్మాది అని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘ బైడెన్ ప్రతి వైఫల్యం వెనుక కమల ఉన్నారు.
ఆమె ప్రెసిడెంట్ అయితే దేశం నాశనమవుతుంది. కానీ మేం అలా జరగనివ్వం. నేను ఎప్పుడూ కరెక్టుగా ఉంటా. కానీ వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వాళ్లతో డీల్ చేసేటప్పుడు కరెక్టుగా ఉండాల్సిన అవసరం లేదు” అని అన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ సమర్థురాలు అని ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత బుధవారం తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
డెమోక్రటిక్ పార్టీని, దేశాన్ని ఒక్కతాటిపై ఉంచాలనే రేసు నుంచి తప్పుకున్నానని తెలిపారు. కొత్త తరానికి, యువతకు బాధ్యతలు అప్పగించాల్సిన టైమ్ వచ్చిందన్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలను ప్రకటించడంతో పార్టీకి జోష్ వచ్చిందని ఇండో అమెరికన్ నేత రాజా కృష్ణమూర్తి అన్నారు.