తడబడ్డ బైడెన్.. మానసికపరిస్థితిపై అనుమానాలు..

తడబడ్డ బైడెన్.. మానసికపరిస్థితిపై అనుమానాలు..

అమెరికా అధ్యక్షుడు బైడెన్ మానసిక పరిస్థితిపై గత కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న ఘటనలు ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ పై తనకున్న విశ్వాసం గురించి రాయిటర్స్ ప్రశ్నించగా బైడెన్ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్ కి గురి చేసింది. వైస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు అధ్యక్షురాలిగా అర్హత లేకపోతే నేను ఆమెను వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసుకోను అంటూ కమలా హారిస్, ట్రంప్ పేర్లను కలిపి పలికాడు బైడెన్.

Also Read:ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో కొట్టుకపోయిన రెండు బస్సులు

బైడెన్ తడబడటం ఇది తొలిసారి కాదు. ఇందుకు కొన్ని గంటల ముందే జరిగిన  నాటో సమ్మిట్ లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ పేరుకు బదులుగా ప్రెసిడెంట్ పుతిన్ పేరును పలికారు బైడెన్. ఈ క్రమంలో,ఇలాంటి మానసిక పరిస్థితిలో ఉన్న బైడెన్ ట్రంప్ ను ఓడించగలడా అన్న అనుమానాలు సొంత పార్టీ నేతల్లో కూడా మొదలవుతున్నాయి. మరి, 81ఏళ్ళ బైడెన్ మానసికపరమైన సవాళ్లను ఎదుర్కొని ట్రంప్ పై విజయం సాధిస్తారా లేదా చూడాలి.