అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ భ్రష్టుపట్టించారని జో బైడెన్ ఆరోపించారు. వెలుగుతున్న ఆర్థిక వ్యవస్థను ఒబామా నుంచి అందిపుచ్చుకున్న ట్రంప్… దానిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ డిబేట్ ఓహియోలోని క్లీవ్ ల్యాండ్‌లో జరిగింది. ఈ డిబేట్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పాల్గొన్నారు.
ఒబామా కేర్ రద్దుపై మొదటి ప్రశ్న అడగ్గా… అది ఓ పెద్ద డిజాస్టర్ అని ట్రంప్ అన్నారు. తాను మిలియన్ల డాలర్లు ట్యాక్స్ చెల్లించినట్టు ట్రంప్ అన్నారు. అందుకు స్పందించిన బైడెన్.. మరి మీరు అధ్యక్షుడైన తర్వాత మంచి హెల్త్ కేర్ ప్లాన్ ఎందుకు తీసుకురాలేకపోయారని ట్రంప్‌ను ప్రశ్నించారు. ఓ స్కూల్ టీచర్ జీతం కంటే తక్కువ ట్యాక్స్ ట్రంప్ కట్టారని బైడెన్ సెటైర్లేశారు. మీరు నిజంగా అంత ఎక్కువ ట్యాక్స్ కడితే.. రిటర్న్స్ చూపించాలని బైడెన్ డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి వస్తే ట్రంప్ ట్యాక్స్ పాలసీని రద్దు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికా చరిత్రలోనే ట్రంప్ చెత్త ప్రెసిడెంట్ అని బైడెన్ మండిపడ్డారు.
For More News..