అధ్యక్ష అభ్యర్థిత్వ పోల్​లో బైడెన్​కు తొలి గెలుపు

  • ట్రంప్​ను మళ్లీ ఓడిస్తానన్న ప్రెసిడెంట్ 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో ప్రెసిడెంట్  జో బైడెన్  (81) తొలి విజయం సాధించారు. సౌత్  కరోలినాలో జరిగిన డెమొక్రటిక్  ప్రెసిడెన్షియల్  ప్రైమరీలో ఆయన గెలిచారు. రూలింగ్  పార్టీకి ఇది మొదటి అధికారిక ప్రైమరీ. ఈ ఎన్నికలో బైడెన్ కు 96.2% ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి మరియన్  విలియమ్సన్ కు 2.1 % ఓట్లే వచ్చాయి. పోల్​లో గెలిచిన తర్వాత బైడెన్ మాట్లాడారు. ఈ ఏడాది నవంబర్​లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్  పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్​ను మరోసారి ఓడిస్తానని పేర్కొన్నారు.