ఇటలీ కొత్త కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ జో బర్న్స్ ఎంపికయ్యాడు. గతంలో ఆసీస్‌కు ఓపెనర్‌గా ఆడిన బర్న్స్.. ఈ ఏడాది మేలో ఇటలీకి వెళ్లాడు. జూన్ 2024లో ఇటలీ తరఫున అరంగేట్రం చేసిన తర్వాత, అతను ఇప్పుడు ఇటలీ జట్టుకు కెప్టెన్‌గా సెలక్టయ్యాడు. ఇటలీ తరపున అరంగేట్రం చేసినప్పటి నుండి, జో బర్న్స్ ఐదు టీ20 మ్యాచ్ లాడాడు. 70.33 సగటుతో 211 పరుగులు చేశాడు.
బర్న్స్ సోదరుడు డొమినిక్ కూడా క్రికెటర్. అతని ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. తన దివంగత సోదరుడికి నివాళిగా జో బర్న్స్ ఇటలీ కోసం ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బర్న్స్ ఆడబోతున్నట్టు తెలియజేశాడు. బర్న్స్ తల్లి ఇటాలియన్ కు చెందింది. అందుకే అతను ఇటలీకి ఆడినట్టు తెలుస్తుంది. సోదరుడు డొమినిక్ బ్రిస్బేన్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు 85 నంబర్ జెర్సీని ధరించేవాడు. బర్న్స్ సైతం తన సోదరుడి 85 నంబర్ జెర్సీని ధరించి క్రికెట్ ఆడడం విశేషం.
Also Read:-6 వికెట్లతో స్టార్క్ విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే భారత్ ఆలౌట్
2024-25 లో క్వీన్స్‌ల్యాండ్ కాంట్రాక్ట్ జాబితా నుండి బర్న్స్ తొలగించబడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటలీ జూన్ 9 నుంచి 16 మధ్య ఫ్రాన్స్, ఐల్ ఆఫ్ మ్యాన్, లక్సెంబర్గ్,టర్కియేలతో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 2014, 2020 మధ్య ఆస్ట్రేలియా తరపున 23 టెస్టులు ఆడిన ఈ 34 ఏళ్ళ ఆటగాడు.. 36 యావరేజ్ తో 1442 పరుగులు చేశాడు. 6 వన్డేల్లో 24 యావరేజ్ తో 146 పరుగులు చేశాడు.
Former Australian opener Joe Burns is now captain of Italy! pic.twitter.com/mUrg4L33gZ
— Circle of Cricket (@circleofcricket) December 6, 2024