అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఫస్ట్ టైం సరికొత్త చరిత్రనే కాదు.. ప్రపంచానికి ఓ చరిత్రను పరిచయం చేసింది. అది సోషల్ మీడియా చరిత్రను.. అవును ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది నిజం. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ట్రంప్ వెనక ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరో కాదు ఒకరు ఎక్స్ (ట్విట్టర్) ఓనర్ ఎలన్ మస్క్, మరొకరు మాజీ నటుడు, పోడ్ కాస్ట్ జో రోగన్. వీళ్లద్దరి గురించే ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచం మాట్లాడుకుంటుంది. ట్రంప్ విజయం వెనక వీళ్లిద్దరూ వ్యూహాలకు.. సంప్రదాయమైన.. లెగసీ పత్రికలు, టీవీలు ఓడిపోయాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత నుంచి ఎలన్ మస్క్.. ట్రంప్ బంధం మరింత బలపడింది. అప్పట్లో ట్విట్టర్ ట్రంప్ ను బ్యాన్ చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా ఆ ట్విట్టర్ ను ఎలన్ మస్క్ 3 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేయటం.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే నినాదంతో ఎక్స్ గా పేరుమార్చి.. ట్రంప్ ను అనుకూలంగా మారిపోయాడు. ట్రంప్ కోసమే ట్విట్టర్ కొనుగోలు చేసేశారనే ప్రచారం సైతం నడిచింది. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలో టాప్ 10 న్యూస్ ఛానెల్స్ ఉంటే.. అందులో ఒకే ఒక్క న్యూస్ ఛానెల్ మాత్రమే ట్రంప్ కు అనుకూలంగా ఉంది. మిగతా అన్ని న్యూస్ అండ్ ప్రింట్ మీడియా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు గా ఉన్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. ట్రంప్ ప్రచారానికి ఉపయోగించాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి ఏకంగా ట్రంప్ తరపున ప్రచారం చేశాడు ఎలన్ మస్క్.
Also Read:-రిపబ్లికన్ల విజయం..132 ఏళ్ల చరిత్ర తిరగరాసిన ట్రంప్
మరొకరు జో రోగన్. మాజీ నటుడిగా.. టీవీ హోస్ట్ సుపరిచితుడు అయిన జో రోగన్.. పోడ్ కాస్ట్ ద్వారా అమెరికా ప్రజలకు బాగా దగ్గర అయ్యాడు. చివరి మూడు నెలలు ట్రంప్ తరపున ప్రచారంలోకి దిగాడు జో రోగన్. ట్రంప్, ఎలన్ మస్క్ తోపాటు పలువురి ఇంటర్వ్యూలు చేశాడు. గ్రేట్ అమెరికా నినాదంతోపాటు అక్రమ వలసలు, పడిపోయిన ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదల, ఉద్యోగాల కోత, ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం వంటి అనేక కారణాలతో జో రోగన్ పలు ఇంటర్వ్యూలు చేశారు. ముఖ్యంగా స్టూడెంట్స్, మేధావులతో జో రోగన్ చేసిన పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు బాగా హిట్ అయ్యాయి. జో రోగన్ సైతం ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అమెరికాలో ఇప్పుడే కాదు అప్పట్లో ట్రంప్ గెలిచినప్పుడు కూడా మీడియా వ్యతిరేకంగానే ఉంది. రెండో సారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ఏ ఒక్క మీడియా కూడా ట్రంప్ కోసం పని చేయలేదు. దీన్ని గుర్తించిన ట్రంప్.. మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. పత్రికలు, టీవీలు ఎటూ సపోర్ట్ చేయవని క్లారిటీ వచ్చి.. ఎలన్ మస్క్ ద్వారా ఎక్స్ ను.. జో రోగన్ ద్వారా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నాడు. అటు ఎలన్ మస్క్, ఇటు జో రోగన్ ఇద్దరూ కూడా పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తలు, డిస్కషన్ లోని పాయింట్లను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ.. కౌంటర్ ఎటాక్ చేసేవారు. వీళ్లిద్దరి సపోర్ట్, వ్యూహాలు లేకపోతే ఇవాళ ట్రంప్ మళ్లీ గెలిచి నిలిచేవాడు కాదు..
ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఏది ఏమైనా 78 ఏళ్ల వయస్సులో ట్రంప్.. రెండో సారి.. అమెరికాకు 47వ అధ్యక్షుడు కాబోతున్నాడు.. వయస్సు కాదు ఇక్కడ మ్యాటర్.. గెలవటానికి కావాల్సిన వ్యూహం ఏంటీ అనేది..