ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా యార్క్‌షైర్ vs గ్లామోర్గాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం.. ఇద్దరు సొంత అన్నాతమ్ముళ్లు తొండాట ఆడరన్నది నెటిజెన్ల మాట. కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రికెటర్, యార్క్‌షైర్ కెప్టెన్ జో రూట్ తన సోదరుడు బిల్లీ రూట్ క్యాచ్‌ను జారవిడిచాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన గ్లామోర్గాన్ కెప్టెన్ సామ్ నార్త్ఈస్ట్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓపెనర్ ఎడ్వర్డ్ బైరోమ్(9) 18 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులో వచ్చిన బిల్లీ రూట్.. సామ్ నార్త్‌ఈస్ట్‌తో జతకలిశాడు. ఆపై కొద్దిసేపటికే బిల్లీ రూట్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను అతని సోదరుడు జో రూట్ నేలపాలు చేశాడు. బెన్ కోడ్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో ఆఫ్ స్టంప్ డెలివరీని బిల్లీ డ్రైవ్ ఆడబోయాడు. అయితే, బంతి ఎడ్జ్ తీసుకొని.. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న జో రూట్ వైపు వెళ్ళింది. రూట్ వెంటనే రియాక్ట్ అయినప్పటికీ.. క్యాచ్ అందుకోలేకపోయాడు. దీంతో లైఫ్‌లైన్ లభించిన బిల్లీ(51) హాఫ్ సెంచరీ బాదాడు. నార్త్‌ఈస్ట్‌తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Joe Root has just dropped his brother Billy 😱😱😱 pic.twitter.com/fb93nGtykP
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) May 3, 2024
తొండాట అంటున్న నెటిజెనులు
క్రికెట్‌లో క్యాచ్‌లు జారవిడచడం కామన్ అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీనిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కావాలనే నేలపాలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
On purpose that. Easy grab
— Sean Perry (@sxp55555) May 3, 2024