ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఒక అరుదైన ఘనత అందుకున్నాడు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో 9 స్థానానికి చేరుకున్నాడు. మొదటి రోజు ఆటలో భాగంగా 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనేని దాటడంతో ఈ ఘనత అందుకున్నాడు.
జయవర్ధనే 11,814 పరుగులు చేసి 10 వ స్థానంలో ఉండగా.. రూట్ 11,818 పరుగులతో 9 వ స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ గా ఈ లిస్టులో భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో టాప్ లో ఉన్నారు. రూట్ మరో 4104 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొస్తాడు.
రూట్ ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో అలెస్టర్ కుక్ (12472) ఉన్నాడు. ప్రస్తుతం రూట్ వయసు 33 సంవత్సరాలు. వైట్ బాల్ క్రికెట్ కు మరో నాలుగేళ్లు దూరంగా ఉండి టెస్ట్ క్రికెట్ లో కొనసాగితే సచిన్ ఆల్ టైం రికార్డ్ ను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. మరో 655 పరుగులు చేస్తే టాప్ 5 లో నిలుస్తాడు.
టెస్ట్ కెరీర్ లో 142 టెస్టుల్లో 259 ఇన్నింగ్స్ లు ఆడిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఖాతాలో 31 సెంచరీలు 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే రూట్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. వెస్టిండీస్ తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌటైంది. పోప్ (123) సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Easily can surpass Sachin Tendulkar 👍🏻
— Suiiii (@AtanuM0007) July 18, 2024
Joe Root 🤍🫡 pic.twitter.com/hHE0ab7sN6