T20 World Cup 2024: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్‌కు అరుదైన గౌరవం

T20 World Cup 2024: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్‌కు అరుదైన గౌరవం

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ లో అతను చేసిన సేవలకు తగిన గుర్తింపుగా ప్రిన్సెస్ అన్నే..  ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) మెంబర్‌గా చేశారు. బుధవారం (జూన్ 13) విండ్సర్ కాజిల్‌లో జరిగిన ఇన్వెస్టిచర్ వేడుకలో రూట్ కు ఈ గౌరవం దక్కింది.  

ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాళ్లలో రూట్ ఒకడు. 2012 లో భారత్ పై అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రూట్ ఇంగ్లాండ్ ఆల్ టైం గ్రేట్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటివరకు 140 టెస్టులు, 171 వన్డేలు, 32 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లాడిన ఈ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ అన్ని ఫార్మాట్ లలో కలిపి 19151 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ గెలవడంతో రూట్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు.
 
ప్రస్తుతం ఇంగ్లాండ్ తరపున రూట్ వన్డే, టెస్ట్ లు ఆడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 11,736 పరుగులు చేసి ఇంగ్లాండ్ తరపున ఈ ఫార్మాట్ లో రెండో స్థానంలో నిలిచాడు. మరో 737 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలుస్తాడు.  12472 పరుగులతో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అగ్రస్థానంలో ఉన్నాడు.