ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఒక అరుదైన ఘనత అందుకున్నాడు. బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న జరుగుతున్న ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో ఏడో స్థానానికి చేరుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను దాటడంతో ఈ ఘనత అందుకున్నాడు.
లారా 11,953 పరుగులు చేసి 8 వ స్థానంలో ఉండగా.. రూట్ 11,991* పరుగులతో ఏడవ స్థానానికి చేరుకున్నాడు. ఓవరాల్ గా ఈ లిస్టులో భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో టాప్ లో ఉన్నారు. రూట్ మరో 4000 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొస్తాడు.
రూట్ ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో అలెస్టర్ కుక్ (12472) ఉన్నాడు. ప్రస్తుతం రూట్ వయసు 33 సంవత్సరాలు. వైట్ బాల్ క్రికెట్ కు మరో నాలుగేళ్లు దూరంగా ఉండి టెస్ట్ క్రికెట్ లో కొనసాగితే సచిన్ ఆల్ టైం రికార్డ్ ను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. మరో 500 పరుగులు చేస్తే టాప్ 5 లో నిలుస్తాడు.
టెస్ట్ కెరీర్ లో 142 టెస్టుల్లో 259 ఇన్నింగ్స్ లు ఆడిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఖాతాలో 31 సెంచరీలు 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే రూట్ 58 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. రూట్ హాఫ్ సెంచరీతో ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (58), కెప్టెన్ స్టోక్స్ (47) క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగులకు ఆలౌటైంది.
JOE ROOT becomes the 7th leading run-getter in Test history 🤯🔥 pic.twitter.com/ByPA7XMoqp
— Johns. (@CricCrazyJohns) July 27, 2024