IND vs ENG 4th Test: కుక్ రికార్డ్ బ్రేక్.. ఇంగ్లాండ్ ఆల్‌టైం టాప్ బ్యాటర్‌గా రూట్

IND vs ENG 4th Test: కుక్ రికార్డ్ బ్రేక్.. ఇంగ్లాండ్ ఆల్‌టైం టాప్ బ్యాటర్‌గా రూట్

భారత్ తో  టెస్ట్ . తొలి మూడు టెస్టుల్లో ఘోరమైన ఆట తీరుతో ఇంగ్లాండ్ జట్టుకు భారంగా మారాడు. ముఖ్యంగా రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టులో బుమ్రా బౌలింగ్ లో చెత్త షాట్ ఆడటంతో తనపై విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే ఇవన్ని పక్కన పెడితే రాంచీలో జరుగుతున్న టెస్టులో రూట్ అదరగొడుతున్నాడు. అర్ధ సెంచరీతో ఇంగ్లాండ్ ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తరపున ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేశాడు. 

టెస్ట్ కెరీర్ లో 61 హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రూట్ కు.. 30 సెంచరీలు తన ఖాతాలో ఉన్నాయి. దీంతో మొత్తం 91 సార్లు 50కి పైగా స్కోర్లు చేసి ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ బ్యాటర్ అలెస్టర్ కుక్ (90) రికార్డ్ బ్రేక్ చేశాడు. నిన్నటివరకు 90 సార్లు 50 కి పైగా స్కోర్లతో కుక్ తో సమంగా రూట్  ఉన్నాడు. తాజాగా ఆ రికార్డ్ కు బ్రేక్ పడింది.  మాజీ ఆటగాడు ఇయాన్ బెల్ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో ఉన్నాడు. 118 మ్యాచ్ ల్లో బెల్ 68 సార్లు 50 కి పైగా స్కోర్లు చేశాడు. రూట్ సెంచరీతో ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో డీసెంట్ టోటల్ చేసేలా కనిపిస్తుంది. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ 71 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. రూట్ 79 పరుగులతో పోరాడుతున్నాడు. క్రీజ్ లో మరో ఎండ్ లో స్పిన్నర్ హర్టీలి(1) బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫోక్స్ 47 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. క్రాలి 42 పరుగులు, బెయిర్ స్టో 38 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు మూడు వికెట్లు తీసుకోగా.. సిరాజ్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.