
ఉప్పల్ వేదికగా మన బ్యాటర్లు మరోసారి శివాలెత్తారు. రాజస్థాన్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లో తడాఖా చూపించింది. కలిసొచ్చిన సొంతగడ్డపై ప్రత్యర్థి బౌలర్లను చితకబాదారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కు చుక్కలు చూపిస్తూ అతనికి పీడకలనే మిగిల్చారు. హైదరాబాద్ బ్యాటర్ల ధాటికి ఆర్చర్ ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్ల ఫుల్ స్పెల్ వేసిన ఈ ఇంగ్లీష్ బౌలర్ ను ఏ ఓవర్ వదలలేదు.
తొలి ఓవర్ లోనే 23 పరుగులు సమర్పించుకున్న ఆర్చర్.. ఆ తర్వాత 12, 22,23 పరుగులు ఇచ్చాడు. ధారాళంగా పరుగులిచ్చిన ఆర్చర్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డ్ మోహిత్ శర్మ పేరిట ఉంది. 2024 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మోహిత్ శర్మ బౌలింగ్ లో 73 పరుగులు పిండుకున్నారు. తాజాగా ఈ రికార్డును ఆర్చర్ 76 పరుగులతో బ్రేక్ చేశాడు.
ALSO READ : ఇదేం కొట్టుడు సామీ: ఉప్పల్లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో విరుచుకుపడింది. సొంతగడ్డపై రాజస్థాన్ కు చుక్కలు చూపించింది. వచ్చిన వారు వచ్చినట్టు చితక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. తొలి సారి సన్ రైజర్స్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషాన్ 45 బంతుల్లో సెంచరీ చేసి దుమ్ము లేపాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ (67) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించగా.. క్లాసన్(34), నితీష్ రెడ్డి (30) రాణించారు.
Jofra Archer has bowled the most expensive spell in IPL history 😳 pic.twitter.com/hmWbo8SHyO
— Sky Sports Cricket (@SkyCricket) March 23, 2025